twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సన్నీ లియోన్... వెబ్ సిరీస్‌పై మత సంస్థ ఆగ్రహం, ఆ పేరు తొలగించాల్సిందే!

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్‌కు జీవితం ఆధారంగా రూపొందించిన వెబ్ సిరీస్ 'కరణ్‌జిత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్'పై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. టైటిల్‌లో 'కౌర్' అనే పదాన్ని తొలగించాలని ఆల్టిమేటం జారిచేసింది.

    'కౌర్' అనే పదాన్ని ఉపయోగించడం వల్ల సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయని ఎస్‌జీపీసీ అడిషనల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి దల్జీత్ సింగ్ బేడీ అన్నారు. సన్నీలియోన్ సిక్కు మత విశ్వాసాలను పాటించడం లేదని, అలాంటపుడు సిక్కు మతానికి చెందిన 'కౌర్' అనే పదాన్ని ఉపయోగించుకునే హక్కు ఆమెకు లేదని, అది చాలా పవిత్రమైన పదమని తెలిపారు. ఈ పదాన్ని వాడుకున్నందుకు ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే అన్నారు.

    Sunny Leones new series Karenjit Kaur faces objection from SGPC

    కెనడాలోని ప్రవాస భారతీయ దంపతులకు సన్నీ జన్మించిన సంగతి తెలిసిందే. ఆమె అసలు పేరు కరణ్‌జిత్ కౌర్. 'కరణ్‌జిత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్' వెబ్‌ సిరీస్‌కు ఆదిత్య దత్ దర్శకత్వం వహించారు.

    ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను బట్టి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె పోర్న్ ఇండస్ట్రీని తన కెరీర్‌గా ఎంచుకున్నట్లు చూపించారు. పోర్న్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు సన్నీ లియోన్ ప్రయాణం ఎలాసాగింది? ఈ క్రమంలో ఆమె ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది, పెద్ద స్టార్‌గా ఎలా ఎదిగింది అనేది ఈ వెబ్ సిరీస్‌లో చూపించనున్నారు.

    English summary
    Actor Sunny Leone is ready to tell her story through Karenjit Kaur: The Untold Story of Sunny Leone despite the Shiromani Gurdwara Parbandhak Committee (SGPC) having issues with the usage of ‘Kaur’ in the title of the web series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X