సల్మాన్ ఖాన్ మూవీ చూసేందుకు వచ్చి... బూతులు మాట్లాడిన సన్నీ లియోన్!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మెతకగా మాట్లాడే మనిషి. అయితే ఆమె ఇటీవల సల్మాన్ ఖాన్ 'భారత్' మూవీ చూసేందుకు వచ్చిన సమయంలో ఆగ్రహంగా బూతులు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆమె ఇక్కడ ఎవరినీ దూషించలేదు, బాధ పెట్టలేదు... ఫ్రెండ్ ఒకరు తన ఫుడ్ దొంగిలించడంతో అనుకోకుండా ఆమె నోటి వెంట బూతు మాట వచ్చింది.
ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. 'భారత్' మూవీ చూసేందుకు వచ్చిన సందర్భంగా పాప్ కార్న్, సమోసాలు కొనుగోలు చేసింది. అయితే పక్కనే ఉన్న ఫ్రెండ్ ఒకరు తన ఫుడ్ తీసుకోండంతో ఎఫ్ వర్డ్ వాడుతూ తిట్టింది. తన నోటి నుంచి ఎఫ్ బాంబ్ వచ్చినందుకు సారీ చెప్పిన సన్నీ లియోన్... అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వడం గమనార్హం.
భారత్ మూవీ నిర్మాతలు బాలీవుడ్ సెలబ్రిటీల కోసం స్పెషల్ షో వేశారు. ఈ షోకు సన్నీ లియోన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందులో టైగర్ ష్రాఫ్, క్రితి సానన్, తారా సుతారియా, అనన్య పాండ్యాతో పాటు ఈ మూవీలో నటించిన కత్రినా కైఫ్, దిశా పటానీ, సునీల్ గ్రోవర్, జాకీ ష్రాఫ్ తదితరులు ఉన్నారు.

'భారత్' మూవీ కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. తొలి రోజు రూ. 42.3 కోట్లు వసూలు చేసి బాక్సాఫీసు వద్ద సునామీ క్రియేట్ చేసింది. సల్మాన్ ఖాన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన చిత్రం కొరియన్ మూవీ 'ఓడె టు మై ఫాదర్' చిత్రం ఆధారంగా రూపొందించారు.


Click it and Unblock the Notifications











