రిహార్సల్‌లో ఊపేస్తోన్న సన్నీలియోన్.. వీడియో వైరల్
శృంగార ప్రపంచంలో సన్నీ లియోన్ పేరంటే ఓ బ్రాండ్. ప్రస్తుతం బాలీవుడ్‌లో సెటిలై.. అప్పుడప్పుడు తెలుగు సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరుస్తూ ఉంది. గరుడవేగ సినిమాలో సన్నీ లియోన్ చేసిన ఐటమ్ సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే.
బాలీవుడ్‌లో రొమాంటిక్ పాత్రలను చేస్తూ.. వెండితెరపై హాట్ హాట్‌గా కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. రాగిని ఎమ్ఎమ్ఎస్2, తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన వెబ్ సరీస్‌లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బట్టియాన్ భుజాడో సినిమాతో బిజీగా ఉంది.

ఈ మూవీకి సంబంధించిన పాటను రిహార్సల్ చేస్తూ.. ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోలో సన్నీ డ్యాన్సులకు, తన అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పోస్ట్ చేసిన గంటలోనే ఐదు లక్షల మంది చూసేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, అతియా శెట్టి నటిస్తోన్న ఈ చిత్రంలో సన్నీ లియోన్ చేసిన ఈ ప్రత్యేక గీతం అందర్నీ మెప్పిస్తుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











