అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన సన్నీ లియోన్..!
పోర్న్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్‌ను అనుభవించిన సన్నీ లియోన్.. బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది. మొదట కొంచెం వ్యతిరేకత వచ్చినా.. కాలం గడుస్తున్నా కొద్దీ సన్నీ ఫుల్ బిజీగా మారింది. స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ అంటూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటోంది.
ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది. స్టార్ స్టక్ పేరిట సౌందర్య ఉత్పత్తుల కంపెనీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తన కంపెనీ ప్రొడక్ట్స్ గురించి ప్రచారం చేస్తూ ఫేమస్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. అయితే నేడు మహిళా దినోత్సవం సందర్భంగా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది.

అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సన్నీ.. ఈ అద్భుతమైన రోజున తన స్టార్ స్టక్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పుకొచ్చింది. ఇలా రెండు చేతుల భారీగానే సంపాదిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











