కొత్త అవతారమెత్తబోతోన్న హాట్ బ్యూటీ.. చివరకు ఆ పనికైనా సిద్దమే.. సన్నీ లియోన్ కామెంట్స్

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కు వచ్చి సెటిలైంది సన్నీ లియోన్. అక్కడి నుంచి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్ చేసిన సన్నీ లియోన్.. బాలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటోంది. వెబ్ సిరీస్‌ల్లో హాట్ హాట్‌గా నటించేస్తూ కుర్రకారుకు మతిపోయేలా చేస్తుంది. తాజాగా మరో కొత్త అవతారమెత్త బోతోన్నట్లు తెలుస్తోంది.

నటన, నిర్మాణంలో..

నటన, నిర్మాణంలో..

ప్రస్తుతం అన్ని భాషల్లోని ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు నటించడమే కాదు.. నిర్మాతలుగానూ అవతారమెత్తుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అందరూ అదే దారిలో పయనిస్తున్నారు. తమ చిత్రాలనే కాకుండా చిన్న చిత్రాలను కూడా నిర్మిస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి హీరోలకు సొంత నిర్మాణ సంస్థలున్నాయన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి సన్నీ లియోన్ చేరనుంది.

నిర్మాతగా మారనున్న సన్నీ..

నిర్మాతగా మారనున్న సన్నీ..

శృంగార తారగా గుర్తింపుపొందిన సన్నీ లియోన్ చిత్ర నిర్మాతగా అవతారం ఎత్తనుంది. ఒక పక్క సినామాలు, మరోపక్క వెబ్ సిరీస్ లతో సన్నీ బిజీగా ఉన్నప్పటికీ.. నిర్మాతగా కొత్త బాధ్యతను చేపట్టడానికి సిద్దమైంది. ఓ పక్క నటిస్తూ నిర్మాణంలోనూ సక్సెస్ సాధిస్తోన్న వారెంతో మంది ఉన్నారు. బాలీవుడ్ చిత్రసీమలో ఇప్పటికే చాలామంది నటీనటులు నటనలో కొనసాగుతూ.. నిర్మాతలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సన్నీ లియోన్ సొంత బ్యానర్ లో సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది.

 అన్నీ ఆయనే చూసుకుంటాడు..

అన్నీ ఆయనే చూసుకుంటాడు..

ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ తన భర్త డేనియల్ వెబర్ చూసుకుంటాడని తెలిపింది. సినిమాకు కావలసిన బడ్జెట్, కథ మన ఆధీనంలో ఉన్నప్పుడు ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని అంది. తమ చిత్రం ఈ ఏడాది సెట్స్ మీదుకు వెళుతుందని చెబుతూ.. ఎంతో ఉత్సాహంగా ఉందని తెలిపింది.

Recommended Video

Is Sunny Leone Suffering From That Disease ? || Filmibeat Telugu
చివరకు ఆ పనికైనా సిద్దమే..

చివరకు ఆ పనికైనా సిద్దమే..

తమ ప్రొడక్షన్ హౌస్‌లో రాబోతోన్న ఈ సినిమాలో సందేశాలుండవని.. ఇది ఒక ఫిక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్ అని తెలిపింది. నిర్మాతనని తనకు ఎలాంటి ఇగో లేదని వివరించింది. చివరకు సినిమా సెట్‌లో టీ అందించమన్నా ఎలాంటి సంకోచం లేకుండా అందిస్తానని, తనకు అందరూ సమానమేనని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X