బాయ్ ఫ్రెండ్‌తో ఆ పనిచేస్తూ దొరికిపోయిన సన్నీలియోన్.. క్రేజీ హీరోయిన్ భర్తపై ప్రేమ!
తక్కువ సమయంలోనే సన్నీలియోన్ బాలీవుడ్ లో క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయింది. అశ్లీల చిత్రాలకు ముగింపు పలికిన సన్నీలియోన్ 2012లో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఐటెం సాంగ్స్, రొమాంటిక్ పాత్రలతో యువతని ఫిదా చేసింది. దీనితో సన్నీలియోన్ కు అవకాశాలు బాగా పెరిగాయి. సౌత్ లో కూడా సన్నీలియోన్ తరచుగా అవకాశాలు అందుకుంటోంది. సన్నీలియోన్ జీవిత చరిత్రపై కరంజీత్ కౌర్ అనే వెబ్ సిరీస్ కూడా ఇటీవల ప్రసారం అయింది. ఆ వెబ్ సిరీస్ లో సన్నీలియోన్ అశ్లీల చిత్రాల నటిగా ఎలా మారింది, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలని చూపించారు. తాజాగా సన్నీలియోన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్ననాటి సంగతులని గుర్తు చేసుకుంది.

స్కూల్ వయసులోనే
సన్నీలియోన్ తన ఫస్ట్ కిస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నా ఫస్ట్ కిస్ ఒక స్వీట్ మెమొరిగా మిగిలిపోయింది. కానీ జరిగిన సంఘటన మాత్రం స్వీట్ కాదు. చాలా హంగామా జరిగింది అని తెలిపింది. స్కూల్ వయసులోనే నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతడితో ఫస్ట్ కిస్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో మా తండ్రి రెడ్ హ్యడెండ్ గా పట్టుకున్నారు అని సన్నీలియోన్ తెలిపింది.

పెద్ద హంగామా
ఆ సంఘటన నాకు ఎప్పటికి గుర్తుండి పోతుంది. బాయ్ ఫ్రెండ్ కి ముద్దు పెడ్దుతున్న సమయంలో మా నాన్న చూసేశారు. ఆ తర్వాత మా ఫ్యామిలీలో పెద్ద హంగామా జరిగింది. యుక్తవయసులోకి వచ్చాక ప్రేమలో పడడం, ఆ తర్వాత పోర్న్ చిత్రాలని ఎంచుకోవడం జరిగిందని సన్నీలియోన్ తెలిపింది. యవ్వనంలో తాను ప్రేమలో పడి మోసపోయిన విషయాన్ని కూడా సన్నీలియోన్ తెలిపింది.

అతడిపై మనసుపడ్డా
సన్నీలియోన్ మాట్లాడుతూ మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించింది. యుక్త వయసు వచ్చాక తాను తొలిసారి మనసుపడ్డ వ్యక్తి ఎవరో సన్నీలియోన్ తెలిపింది. హాలీవుడ్ హాట్ బ్యూటీ ఏంజెలినా జోలీ మాజీ భర్త బ్రాడ్ పిట్ పై తాను తొలిసారి మనసుపడ్డానని సన్నీలియోన్ తెలిపింది. తన జీవితంలో అనేక బాధాకర సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని తెలిపింది. తాను పోర్న్ ఇండస్ట్రీని పదలిపెట్టినా ఆ విషయాన్ని గుర్తు చేస్తూ చాలా మంది ఇబ్బంది పెడుతుంటారని సన్నీలియోన్ పేర్కొంది.

చేతినిండా సినిమాలు
ప్రస్తుతం సన్నీలియోన్ రొమాంటిక్ పాత్రలు మాత్రమే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న అవకాశాలు కూడా వరిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న వీరమహాదేవి చిత్రంలో సన్నీలియోన్ టైటిల్ రోల్ పోషిస్తోంది. మలయాళంలో మమ్ముట్టి నటిస్తున్న మధుర రాజా చిత్రంలో సన్నీలియోన్ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











