TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
తన ఇద్దరు కవలలతో సన్నీ లియోన్, ముద్దులు పెడుతూ ఎయిర్‌పోర్ట్‌లో.. (వీడియో)
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన ఇద్దరు కవల కుమారులు నోవా, అషెర్‌తో కలిసి గురువారం ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కంటపడ్డారు. అక్కడ మీడియావారు వెంటపడటంతో తన బిడ్డకు ముద్దులు పెడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఒక బేబీని ఆమె స్వయంగా ఎత్తుకుని వస్తుండగా.. మరొక బిడ్డను సహాయకురాలు ఎత్తుకుని కనిపించారు. ఇద్దరు పిల్లలు అందంగా క్యూట్‌గా ఉండటంతో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
సరోగసీ విధానం ద్వారా
సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ సరోగసీ ద్వారా 2018లో కవలలకు జన్మనిచ్చారు. అంతకు ముందు సంవత్సరం వీరు నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ దంపతుల పిల్లల సంఖ్య 3కు చేరింది.
|
ఈ పిల్లలతో మా కల నిజం అయింది
మేము చాలా కాలంగా పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. అషెర్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్, నిషా కౌర్ వెబర్‌తో మా కల నిజమైంది. తమ ఇద్దరు పిల్లలు కొన్ని నెలల క్రితమే జన్మించినప్పటికీ.... వారి గురించి మేము చాలా సంవత్సరాలుగా కలలు కంటున్నామని తెలిపారు.
దేవుడు పెద్ద ఫ్యామిలీ ఇచ్చాడు
దేవుడు మా కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసి చాలా పెద్ద ఫ్యామిలీని ఇచ్చాడు. మాకు ముగ్గురు అందమైన పిల్లలు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం... అంటూ సన్నీ లియోన్ గతంలో సోషల్ మీడియా ద్వారా తన మనసులోని భావాలను వ్యక్త పరిచారు.
సన్నీ లియోన్
సన్నీ లియోన్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె మలయాళంలో ‘రంగీలా' అనే చిత్రం సంతోష్ నాయర్ దర్శత్వంలో చేస్తున్నారు. మలయాళంలో ఆమె చేస్తున్న తొలి చిత్రం ఇది. జయలాల్ మీనన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.