Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కండల వీరుడు కాదు.. యంగ్ హీరోనే: ప్రభాస్ ‘ఆదిపురుష్’లో లక్ష్మణుడు ఫిక్స్
పేరుకు తెలుగు హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇటీవలి కాలంలో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తోన్న అతడు.. యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా హిందీ సినిమాలో నటించబోతున్నాడు. అదే.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తోన్న 'ఆదిపురుష్'. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో మూవీ గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. ఇక, కృతి సనన్ సీతగా కనిపించబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇందులో అత్యంత ముఖ్యమైన లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేస్తాడని వార్తలు వచ్చినా.. ఆ తర్వాత బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ పేరు గట్టిగా వినిపించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. సన్నీనే ఈ పాత్రకు ఫిక్స్ చేశారట. అంతేకాదు, అతడు ఇప్పటికే షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడని టాక్.
ప్రభాస్ మొదటి హిందీ చిత్రంగా రాబోతున్న 'ఆదిపురుష్' తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్రీడీ సినిమాగా రాబోతున్న దీనికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ ఇప్పటికే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇక, శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 21న ఈ మూవీలోని ప్రభాస్ లుక్‌ను రివీల్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.