Don't Miss!
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెంటాడుతున్న కంగన.. తోక ముడిచిన హృతిక్.. మానసిక వేధింపులు అంటూ!
బాలీవుడ్లో హృతిక్ రోషన్, కంగన రనౌత్ మధ్య వివాదం ఎడతెగని సీరియల్లా కొనసాగుతున్నది. మధ్యలో వీరి మధ్య గొడవ సద్దుమణిగినట్టు కనిపించినా మళ్లీ తాజాగా వివాదం రాజుకొన్నది. హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30, కంగన రనౌత్ నటించిన మెంటల్ హై క్యా సినిమా ఒకే రోజున విడుదల కావడం అంటే జూలై 26న రిలీజ్ డేట్లు ప్రకటించడం తాజా వివాదానికి కారణమైంది. ఇప్పటికే ఉన్న పాత వివాదం ఉండటంతో రెండు సినిమాలు ఒకే రోజు పోటీగా రిలీజ్ కావడం మీడియా హైడ్ లైన్లను ఆకర్షించాయి. అయితే మీడియాలో జరుగుతున్న లొల్లిని దృష్టిలో పెట్టుకొని హృతిక్ రోషన్ తన సినిమా రిలీజ్ డేట్‌ను మార్చుకొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖను రాశారు.
నా సినిమా మరో మీడియా సర్కస్‌గా మారకూడదు. అందుకే నా మూవీ సూపర్ 30 రిలీజ్ డేట్‌ను మార్చాలని నిర్ణయించాను. ఈ వివాదం నాకు మానసిక సంఘర్షణకు, వ్యధ గురిచేస్తున్నది. దానిని తప్పుకోవడానికే ఈ నిర్ణయం తీసుకొన్నాను అని కంగన రనౌత్ వెల్లడించారు.
నా సినిమా రిలీజ్‌కు అన్ని రకాలుగా పూర్తయింది. అయితే మానసిక ప్రశాంతత కోసం సినిమాను వాయిదా వేయాలని నిర్మాతలను రిక్వెస్ట్ చేశాను. మరో సరైన తేదీని చూడమని కోరుకొన్నాను అని హృతిక్ తెలిపారు. సమాజంలో నాగరికత, నమ్మకం, సహృద్భావం ఉండాలని కోరుకొనే వ్యక్తిని. వాతావరణాన్ని కలుషితం చేసే సహాయనిరాకరణకు ముగింపు పలకాలి అని తన లేఖలో హృతిక్ పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ వివాదానికి కంగన రనౌత్ తెర తీశారు. ఆమె నటించిన మెంటల్ హై క్యా చిత్రం జూన్ 21న రిలీజ్ చేశారు. ఆ తర్వాత దానిని సూపర్ 30 మూవీ రిలీజ్ డేట్ జూలై 26కు మార్చుతూ నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే కంగన ఈ పనిచేసిందనే విమర్శలు రావడంతో ఆమె చెల్లెలు రంగోలి తీవ్రంగా స్పందించారు. మెంటల్ హై క్యా సినిమా రిలీజ్ డేట్ మార్చడం ఏక్తా కపూర్ నిర్ణయం అని హృతిక్‌పై ధ్వజమెత్తారు.
గతంలో తమ మధ్య రిలేషన్స్ బెడిసి కొట్టడంతో కంగన, హృతిక్ పరస్పర విమర్శలు చేసుకొన్నారు. అప్పటి నుంచి హృతిక్‌ను కంగన టార్గెట్ చేస్తూ మానసికంగా ప్రశాంతత లేకుండా చేస్తున్నది. గతంలో సూపర్ 30 రిలీజ్ డేట్ వాయిదా పడటానికి కారణం కంగనే కావడం గమనార్హం. వాస్తవానికి సూపర్ 30 మూవీ జనవరిలో విడుదల కావాల్సింది. కానీ కంగన నటించిన మణికర్ణికతో పోటీ పడటం ఇష్టం లేక హృతిక్ తన సినిమాను వాయిదా వేసుకొన్నాడు.