twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సూపర్ 30’ మూవీకి బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం!

    |

    హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన 'సూపర్ 30' చిత్రానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటించింది. పట్నాకు చెందిన గణిత శాస్త్ర బోధకుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి(జులై 16) నుంచి ఇది అమలులోకి రానుంది.

    ఈ మేరకు బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి సుశీల్ కుమార్ మోడీ ప్రకటన చేశారు. ఇటీవల సుశీల్ కుమార్ తన భార్యతో కలిసి ఈ సినిమా చూసేందుకు వెళ్లారు. ఈ బయోపిక్ తనకు ఎంతో నచ్చడంతో ప్రశంసలు గుప్పించారు. బీహార్ రాష్ట్ర ప్రతిష్ట పెంచే విధంగా ఈ సినిమా ఉందని, అందుకు పన్ను రాయితీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

    బీహార్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీకి థాంక్స్ చేబుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

     Super 30 tax-free in Bihar

    ఈ సినిమా రిలీజ్ తర్వత ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... బీహార్‌కు సంబంధించిన ఏ సినిమా కథైనా నెగిటివిటీ, దోపిడీల గురించే ఉంటుంది. అయితే 'సూపర్ 30' అందుకు భిన్నంగా ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చే విధంగా ఉంది. బీహార్ అంటే ఏమిటో ఇపుడు ప్రపంచానికి తెలుస్తుంది. కష్టాలు పడి ఉన్నత స్థానానికి ఎదిగిన వారు ఇక్కడ ఉన్నారనే విషయం అందరికీ తెలుస్తుందని ఆనంద్ కుమార్ తెలిపారు.

    ఈ బయోపిక్ వికాస్‌ బెహల్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. జులై 12న విడుదలైంది. ఆనంద్ కుమార్‌ 'సూపర్‌ 30' అనే ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌ను రన్ చేస్తూ ఏటా 30 మంది పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారికి ఐఐటీలో సీటు దక్కేలా చేస్తున్నాడు. తన కెరీర్లో ఎంతో మంది పేదల ఐఐటి కల సాకారం చేసిన అతడి జీవితాన్నే సినిమాగా తీశారు.

    English summary
    The Bihar government announced that Hrithik Roshan-starrer Super 30 will be tax-free in the state from Tuesday. "Thank you CM Nitish Kumar ji and Deputy CM Sushil Kumar Modi ji for declaring #Super30 tax- free in Bihar! Here's to the power of education and dreams." Super 30 team tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X