Shah Rukh Khan: అభిమానిపై షారుక్ ఖాన్ ఫైర్.. బాలీవుడ్ బాద్షా అలా చేయడంతో అందరూ షాక్!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈయన అందం, అభినయంతో పాటు ఆయన యాటిట్యూడ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈయనను చూసేందుకు, కలిసి ఫొటో దిగేందుకు లక్షలాది మంది అభిమానులు వేచి చూస్తుంటారు. జీవితంలో ఒక్కసారి అయినా ఆయనను కలవాలని, ఫొటో దిగాలని మాట్లాడాలని కోరుకుంటారు. ఇదా చాలా మంది.. హీరోహీరోయిన్ల పై అభిమానం కురిపిస్తుంటారు. అయితే ఇటీవల ఒక ఫ్యాన్ ఫొటో దిగేందుకు ప్రయత్నం చేయగా చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే..

రచ్చ మామూలుగా ఉండదు:షారుఖ్ ఎక్కడైనా పబ్లిక్ ప్లేసుల్లో కనిపిస్తే ఇక ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఓ వైపు మీడియా మరోవైపు అభిమానులు వారిని అడుగు కూడా ముందుకు వేయనివ్వరు. ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉంటారు. వారు అసౌకర్యంగా ఫీలవుతున్నా పట్టించుకోకుండా సెల్ఫీలు, ఫొటోలు తీస్తుంటారు. ఇలాంటి ఆ అనుభవమే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు ఎదురైంది.

Superstar Shah Rukh Khan Refuses Selfie, Pushes Away Fan’s Hand

సెల్ఫీ కోసం ప్రయత్నాలు:వారం రోజుల క్రితమే షారుఖ్ ఖాన్... రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న డుంకీ చిత్రీకరణ కోసం కశ్మీర్ వెళ్లారు. తన పనులు ముగించుకొని ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఆయన శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకోగానే అభిమానులు పరుగులు పెట్టుకుంటూ ఆయన వద్దకు వచ్చారు. ఓ అభిమాని అయితే షారుఖ్ ఖాన్ పర్మిషన్ లేకుండానే సెల్ఫీ తీయబోయాడు. ఇంట్రెస్ట్ లేని హీరో వద్దని అభిమాని చేతిని వెనక్కి తోశాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న మరో వ్యక్తి అతడిని గట్టిగా తోశాడు.

Superstar Shah Rukh Khan Refuses Selfie, Pushes Away Fan’s Hand

అభిమాని ఫోన్ కింద పడిపోయింది.:దీంతో సెల్ఫీ దిగాలని చూసిన అభిమాని ఫోన్ కింద పడిపోయింది.ఆ వ్యవహారం మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కాసేపట్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఇలా చేసిండకూడదని కొందరు, వాళ్ల పర్మిషన్ లేకుండా ఫొటోలు తీయడం సరికాదని మరికొంత మంది అంటున్నారు.

Superstar Shah Rukh Khan Refuses Selfie, Pushes Away Fan’s Hand

కూలింగ్ గ్లాసెస్ లో అదిరిపోయాడు.:అయితే ఈ వీడియోలో షారుఖ్ బ్లాక్ అండ్ బ్లాక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. బ్లాక్ టీషర్ట్ విత్ మ్యాచింగ్ లెదర్ జాకెట్ స్నీకర్స్ విత్ కూలింగ్ గ్లాసెస్ లో అదిరిపోయాడు. షారుఖ్ ఖాన్ ఇటీవలే హీరోగా నటించి పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ చిత్రం జనవరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రెండ్ సెట్ చేసింది.

జవాన్ సినిమాలో..:ప్రస్తుతం షారుఖ్ ఖాన్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "జవాన్"లో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతితో కూడా కనిపించనున్నారు. "జవాన్" జూన్ 2, 2023న విడుదల కానుంది. అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా రాబోతున్న టైగర్-3 చిత్రంలో షారుక్ ఓ ప్రత్యేక సన్నివేశంలో కనిపించబోతున్నాడట. అలాగే రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న డుంకీలో కూడా షారుఖ్ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X