»   » వివాదాస్పద ‘నానాక్ షా ఫకీర్’ చిత్రం విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

వివాదాస్పద ‘నానాక్ షా ఫకీర్’ చిత్రం విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిక్కుల తొలి గురువు గురు నానక్ జీవితం, మత బోధనలపై తెరకెక్కిన చిత్రం 'నానాక్ షా ఫకీర్'. వివాదాస్పద చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం విడుదలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న దేశ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సిక్కుల అత్యున్నత మత సంస్థ అకాల్ తక్త్ చిత్రం విడుదలపై నిషేదం విధించింది. ఇందులో సిక్కుల మత గురువును చూపించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై చిత్ర నిర్మాత, రిటైర్డ్ నేవీ అధికారి హరీందర్ ఎస్ సిక్కా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెషన్ సంస్థ అనుమతి ఇచ్చిన తర్వాత విడుదలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది. సిక్కు మత సంస్థ ఈ చిత్రాన్ని అడ్డుకోవడాన్ని తప్పుబట్టింది.

విడుదలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా తగిన భద్రత కల్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. సినిమా విడుదల సమయంలో ఆందోళనలు జరిగే అవకాశం ఉండటంతో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.

కాగా... ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ మద్దతు, ఆశీర్వాదంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనేది తెలియదు. కేవలం నిర్మాత, నటీనుటులు, టెక్నీషియన్ల పేర్లు మాత్రమే విడుదల చేశారు.

English summary
The Supreme Court today cleared the decks for an all-India release of the controversial movie Nanak Shah Fakir on April 13.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X