twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ మంచోడా చెడ్డోడా అన్నది కాదు.. పోలీసులను విచారించనివ్వండి.. సుప్రీంకోర్టు కామెంట్స్

    |

    సుశాంత్ సింగ్ మరణం ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. సుశాంత్ ప్రాణాలు వదిలి నెల రోజులు దాటినా ఏ ఒక్క విషయం బయటకు రాలేదు. రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇన్ని రోజులు బాలీవుడ్ మాఫియా, నెపోటిజం వల్లే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అంతా భావించారు. అయితే సుశాంత్ కుటుంబం మాత్రం రియాపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కేసులో అదిరిపోయే ట్విస్ట్ ఏర్పడింది. గత రెండు మూడు రోజుల నుంచి రియా చక్రవర్తి చుట్టే ఉచ్చు బిగుస్తోందన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇదే క్రమంలో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలనే వాదనపై సుప్రీం కోర్టు స్పందించింది.

    Recommended Video

    Sushant Singh కేసును CBI కి ఇవ్వని Supreme Court సుశాంత్ మంచోడా చెడ్డోడా అన్నది కాదు.. SC కామెంట్స్!
    సుశాంత్ తండ్రి ఆరోపణలు..

    సుశాంత్ తండ్రి ఆరోపణలు..

    సుశాంత్ సింగ్ మరణంపై సోషల్ మీడియాలో రోజుకో వాదన వినిపిస్తూ ఉండేది. ఒక రోజు కరణ్ జోహర్, మరొక రోజు సల్మాన్ ఖాన్, ఇంకో రోజు మహేష్ భట్ ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్స్‌పై ఆరోపణలు వినిపిస్తూనే వచ్చాయి. అయితే తాజాగా సుశాంత్ తండ్రి ఆరోపణలతో మొత్తం మారిపోయింది.

    డబ్బు కాజేసింది..

    డబ్బు కాజేసింది..

    తన కుమారుడు సుశాంత్‌కు ఓవర్ డోస్ మందులు ఇచ్చేదని, గత కొన్ని రోజులుగా బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బులు తీసుకుని వాడుకుందని, దాదాపు 15 కోట్లు మాయమయ్యాయని ఆరోపణలు చేశాడు. అన్ని అవసరాలకు సుశాంత్‌ డబ్బే వాడిందని, ఆమె వల్లే అంతా జరిగిందని రియాపై ఫిర్యాదు చేశారు.

    అరెస్ట్ అంటూ వార్తలు..

    అరెస్ట్ అంటూ వార్తలు..

    రియాపై సుశాంత్ తండ్రి ఆరోపణలు, బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని వార్తలు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక ఈ నేపథ్యంలో రియాను అరెస్ట్ చేయబోతోన్నారంటూ ప్రచారం కావడం అందరికీ షాక్ అనిపించింది. ఆమె కూడా లాయర్‌ను సంప్రదించి ముందస్తు బెయిల్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

    సీబీఐకి అప్పగించాలని..

    సీబీఐకి అప్పగించాలని..

    సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని ఎప్పటి నుంచో వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అల్క ప్రియ అనే అభిమాని వేసిన పిల్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. సుశాంత్ మంచి నటుడు, ఎంతో మందికి సాయం చేశాడు. అతని కేసును సీబీఐకి అప్పగించడని అందులో పేర్కొంది.

    మంచోడా? చెడ్డొడా? అని కాదు..

    మంచోడా? చెడ్డొడా? అని కాదు..

    అయితే ఆ పిల్‌ను ధర్మాసనం కొట్టివేస్తూ.. ‘సుశాంత్ మంచి వాడా? చెడ్డవాడా? అని కాదు పోలీసులు విచారణ జరపుతున్నారు.. వారిని విచారించనివ్వండ'ని సీబీఐకి అప్పగించే నిర్ణయాన్ని పక్కకు పెట్టేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ముంబై పోలీసుల మీద ట్రోలింగ్ జరుగుతోంది. షేమ్ ఆన్ ముంబై పోలీస్ అంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

    English summary
    Supreme Court Of India About Sushant Singh Case to CBI. We are not on whether the person was good or bad. The matter is being investigated by Mumbai Police. We are dismissing it
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X