twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి మరణం వెనుక రూ. 240 కోట్ల వ్యవహారం, కోర్టులో లాయర్ వాదనతో అంతా షాక్!

    By Bojja Kumar
    |

    ప్రముఖ నటి శ్రీదేవి మరణంపై అభిమానుల్లో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. బంధువుల పెళ్లి వేడుక కోసం దుబాయ్ వెళ్లిన ఆమె అక్కడి ఓ స్టార్ హోటల్‌‍లో శవమై తేలడం అందరినీ షాక్‌కు గురి చేసింది. శ్రీదేవి మరణంపై విచారణ జరిపిన దుబాయ్ పోలీసులు ఎలాంటి కుట్ర కోణం లేదని, ప్రమాద వశాత్తు బాత్ టబ్‌లో పడిపోవడం వల్లనే మరణించిందని తేల్చినప్పటికీ ఇంకా ఈ అనుమానాలు క్లియర్ కాలేదు. తాజాగా శ్రీదేవి డెత్ విషయమై సుప్రీం ఆశ్రయించిన పిటీషనర్ వాదనలు అందరూ షాకయ్యేలా చేశాయి.

     సుప్రీంను ఆశ్రయించిన ఫిల్మ్ మేకర్

    సుప్రీంను ఆశ్రయించిన ఫిల్మ్ మేకర్

    ప్రముఖ నటి శ్రీదేవి మరణంపై కుట్ర కోణం ఉందనే అనుమానాలు ఉన్నాయని, దీనిపై ఇండిపెండెంట్ విచారణ జరిపించాలని కోరుతూ ఫిల్మ్ మేకర్ సునీల్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటీషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ దీపిక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై స్పందిస్తూ... గతంలో ఇలాంటి పిటీషన్లు వచ్చాయని, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయబోమని తేల్చి చెప్పారు.

     అది ఎలా సాధ్యం అని పిటీషన్లో పేర్కొన్న సునీల్ సింగ్

    అది ఎలా సాధ్యం అని పిటీషన్లో పేర్కొన్న సునీల్ సింగ్

    పిటీషన్ దాఖలు చేసిన సునీల్ సింగ్ 5.7 అడుగుల ఎత్తు ఉన్న శ్రీదేవి కేవలం 5 అడుగుల పొడవు ఉన్న బాత్ టబ్‌లో మునిగి ఎలా చనిపోతోందని? దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.

    శ్రీదేవి మీద రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్

    శ్రీదేవి మీద రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్

    శ్రీదేవి పేరు మీద రూ. 240 కోట్ల ఇన్యూసరెన్స్ పాలసీ ఉందని.... ఈ వ్యవహారం కూడా తమ అనుమానాలకు కారణం అని సునీల్ సింగ్ లాయర్, సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ కోర్టు ముందు వాదించారు.

    దుబాయ్‌లో మరణిస్తేనే దాన్ని క్యాష్ చేసుకోవచ్చు

    దుబాయ్‌లో మరణిస్తేనే దాన్ని క్యాష్ చేసుకోవచ్చు

    శ్రీదేవి పేరు మీద రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఒమన్ దేశంలో చేయించారని, దుబాయ్‌లో మరణిస్తేనే ఆ ఇన్యూరెన్స్ పాలసీ ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం ఉందని.... వికాస్ సింగ్ కోర్టు ముందు వాదించడం చర్చనీయాంశం అయింది.

     హోటల్ గదిని సందర్శించాం

    హోటల్ గదిని సందర్శించాం

    దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన హోటల్ గదిని తమ లీగల్ అడ్వైజర్‌తో సందర్శించామని, అక్కడి పరిస్థితులు పరిశీలించిన తర్వాత తమలో ఎన్నో అనుమానాలు రేకెత్తాయని... తమ పిటీషన్లో సునీల్ సింగ్ పేర్కొన్నారు.

     శ్రీదేవి మరణం

    శ్రీదేవి మరణం

    తమ బంధువుల వివాహానికి హాజరు కావడానికి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24న మరణించారు. అప్పటి వరకు పెళ్లి వేడుకలో సంతోషంగా గడిపిన ఆమె మర్నాడు శవమై తేలడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోయారు.

    English summary
    The Supreme Court on Friday dismissed a petition filed by a filmmaker seeking an independent probe into the death of Bollywood actor Sridevi, who was found dead in a hotel in Dubai on February 24.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X