twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాక్ నటుడికి పరేష్ రావల్ అదిరిపోయే కౌంటర్.. ఇప్పుడు మాటల్లేవా!

    |

    పుల్వామా ఘటనకు భారత్ తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది. నేరుగా పాక్ భూభాగంలోకి ప్రవేశించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ యుద్ధ విమానాలు జైషే మహమ్మద్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ ని నేలమట్టం చేసి వచ్చాయి. దీనిని అంతా సర్జికల్ స్ట్రైక్ 2గా అభివర్ణిస్తున్నారు. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదుల మరణించినట్లు భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. దీనితో ఇండియా, పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ సోషల్ మీడియాలో పాక్ నటుడికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

    పాక్ నటులపై బ్యాన్

    పాక్ నటులపై బ్యాన్

    పుల్వామా ఘటనకు నిరసనగా బాలీవుడ్ పాక్ నటులపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా సర్జికల్ స్ట్రైక్ జరిపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సమయంలో ఇండియా, పాక్ నటుల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ పాక్ నటుడు అలీ జాఫర్ ట్విట్టర్ కామెంట్ పై స్పందించారు.

     వాట్ ఎ స్పీచ్

    వాట్ ఎ స్పీచ్

    పుల్వామా ఘటన తర్వాత పాక్ పై నిరసనలు వెల్లువెత్తాయి. దీనికి సమాధానం ఇవ్వాలని భారత ప్రభుత్వం పాక్ ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ స్పీచ్ పై పాక్ నటుడు అలీ జాఫర్ స్పందించాడు. డియర్ జిందగీ, మేరే బ్రదర్ కి దుల్హన్ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో అలీ జాఫర్ నటించాడు. అతడు ట్విట్టర్ లో ఇమ్రాన్ ఖాన్ స్పీచ్ ని ఉద్దేశిస్తూ వాట్ ఎ స్పీచ్ ఇమ్రాన్ ఖాన్ అని ట్వీట్ చేశాడు.

    ఇప్పుడు మాటల్లేవా

    పుల్వామా ఘటన జరిగిన 12 రోజుల్లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ లో సర్జికల్ స్ట్రైక్ జరిపింది. 1000 కేజీల బాంబుతో 300 మంది ఉగ్రవాదులని మట్టికరిపించారు. సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత ఓ నెటిజన్ అలీ జాఫర్ కు కౌంటర్ ఇస్తూ వాట్ ఎ స్ట్రైక్ నరేంద్రమోడీ అని ట్వీట్ చేశాడు. అలీ జాఫర్ కు పరేష్ రావల్ కూడా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఇపుడు మాటల్లేవా అని ట్వీట్ చేశాడు.

    భారత సినిమాల బ్యాన్

    భారత సినిమాల బ్యాన్

    పుల్వామా ఘటన తర్వాత ఇండియా పాక్ నటుల్ని నిషేదించగా.. సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాకిస్థాన్ కూడా భారత చిత్రాలని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్, ఇండియా మధ్య పూర్తిగా సంబంధాలు తెగిపోతున్నాయి. ఇది ఎలాంటి పరిస్థితి దారి తీస్తుందో చూడాలి.

    English summary
    Surgical Strike 2 on Pakistan: Paresh Rawal slams Ali Zafar for praising Pak PM Imran Khan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X