నగ్నంగా కనిపించినా నా భర్త ఏమీ అనుకోరు.. హాట్ బ్యూటీ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ సుర్వీన్ చావ్లాకు అందాలతో యువతకు గాలం వేయడం అలవాటే. ఈ హాట్ బ్యూటీ ఘాటు అందాలతో వెండి తెరపై యువతని కవ్విస్తూ ఉంటుంది. వివాహం జరిగాక కూడా ఈ భామ దూకుడుకి అడ్డూ అదుపు లేదు. సాధారణంగా నటీమణులు వివాహం జరిగాక గ్లామర్ రోల్స్ చేయడం తగ్గిస్తారు.పెళ్లయ్యాక కూడా నటన కొనసాగించే హీరోయిన్లు ఉన్నా గ్లామర్ వేషాలు మాత్రం ఎవరూ వేయరు.
తనకు మాత్రం ఆ ఇబ్బంది లేదంటోంది సుర్వీన్ చావ్లా. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుర్వీన్ హాట్ కామెంట్స్ చేసింది. అను చేస్తున్న వృత్తి పట్ల తన భర్తకు ఎంతో గౌరవం ఉందని సుర్వీన్ తెలిపింది. తనని నిత్యం ఆయనే ప్రోత్సహిస్తూ ఉంటారని సుర్విన్ వివరించింది. పెళ్ళైనంత మాత్రాన నటనకు విరామం ఇవ్వాలనే రూల్ లేదని సుర్వీన్ తెలిపింది.

తాను నగ్నంగా కనిపించినా తన భర్త ఏమి అనుకోరని, అర్థం చేసుకుంటారని హాట్ కామెంట్స్ చేసింది. కథ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాల్లో నటించడానికి, నగ్నంగా కనిపించడానికి తనకు అభ్యంతరం లేదని సుర్వీన్ చావ్లా వివరించింది. పెళ్లయ్యాక కూడా గ్లామర్ వేషాలు వేస్తుండడం పైగా భర్త సపోర్ట్ ఉందని చెప్పడం ఏంటని బాలీవుడ్ వర్గాలు సుర్విన్ చావ్లా గురించి చర్చించుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











