ఫామ్‌హౌజ్‌లో రియా అలా.. గుట్టు విప్పిన మేనేజర్.. సుశాంత్‌ను అలా దారుణంగా అంటూ వెల్లడి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి చేసిన నిర్వాకాలన్ని ఒక్కొక్కటిగా జాతీయ ఛానెళ్లు బయటపెడుతున్నాయి. తాజాగా ఈ మరణం కేసు దర్యాప్తులో కీలకంగా మారే సాక్ష్యాన్ని సుశాంత్ ఫామ్‌హౌస్ మేనేజర్ బయటపెట్టారు. జాతీయ ఛానెల్ రిపబ్లిక్‌కు మాజీ మేనేజర్ రజత్ మెవాటి అత్యంత కీలక విషయాలను వెల్లడించారు. మేనేజర్ రజత్ మీవాటి చెప్పిన విషయాలు ఏమిటంటే..

సుశాంత్ పావ్నా లేక్ ఫామ్‌హౌస్‌కు రియా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ముంబై సమీపంలోని పావ్నా లేక్‌లో ఫామ్‌హౌజ్ ఉంది. ఆ ఫామ్‌హౌజ్‌కు రెండేళ్ల పాటు రజల్ మెవాటి మేనేజర్‌గా వ్యవహారించాడు. ఆ రెండేళ్ల కాలంలో రియా, సుశాంత్ మధ్య చోటుచేసుకొన్న సంఘటనలను వెల్లడించారు. తరచూ రియా చక్రవర్తి ఫామ్‌హౌజ్‌కు వచ్చి పార్టీలు చేసుకొనే వారు అని పేర్కొన్నారు.

రియా చక్రవర్తి తన కుటుంబంతో
రియా చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ ఫామ్‌హౌజ్‌లో పార్టీలు చేసుకొనే వారు. రియా పార్టీలో మునిగి తేలుతుంటే సుశాంత్ కింది గదిలో నిద్రపోయేవాడు. షోవిక్‌ను ఎప్పుడూ చూసినా సిగరెట్లు, మత్తు పదార్థాలు తీసుకొంటూ కనిపించేవారు. 2019 నుంచి ఫామ్‌హౌజ్‌కు శృతి మోడీ రావడం ప్రారంభించారు అని సుశాంత్‌తో ట్రిప్పుకు వెళ్లిన తర్వాత ఇక్కడకు రావడం ఎక్కువైంది అని రజత్ మెవాటి తెలిపారు.

రియా విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపై సుశాంత్
ఆ తర్వాత సుశాంత్ ఆర్థిక వ్యవహారాలన్నీ రియా చక్రవర్తి చూసుకోవడం ప్రారంభించింది. ఓ సారి సుశాంత్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకు రమ్మని పంపించారు. రియా తన డబ్బును విచ్చలవిడిగా వాడుకోవడంపై ఓ సారి సుశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు అని రజత్ మెవాటి పేర్కొన్నారు.

షోవిక్ చక్రవర్తితో మరో అమ్మాయి
సుశాంత్‌తోపాటు రియా చక్రవర్తినే కాకుండా ఆమె కుటుంబ సభ్యులు కూడా వచ్చేవారు. గతేడాది జూలై 8వ తేదీన రియా పుట్టిన రోజున ఆమె తల్లి, తండ్రి, సోదరుడు షోవిక్ వచ్చారు. షోవిక్‌తోపాటు మరో అమ్మాయి కూడా వచ్చింది. ఇవే విషయాలు సీబీఐ అడిగితే నాకు తెలిసిన అన్ని విషయాలు చెప్పాను అని రజత్ మేవాటి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Recommended Video

రియాకు సెప్టెంబర్ 22 వరకు కస్టడీ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్యాప్తులో భాగంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఆమె బైకుల్లా జైలులో ఉన్నారు. సెప్టెంబర్ 22వ తేదీ వరకు రియా కస్టడీలో ఉంటుంది.


Click it and Unblock the Notifications











