twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియా చక్రవర్తి గోల్‌మాల్.. ఆదాయానికి మించి ఆస్తులు.. ఆ రెండు బ్యాంకులపై ఈడీ నజర్!

    |

    బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తికి సంబంధించిన ఆస్తులు ఆదాయానికి మించి ఉండటంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) తీవ్రంగా పరిగణిస్తున్నది. ఆదాయానికి మంచి ఆస్తులు ఉండటంపై అడిగిన లెక్కలకు రియా పొంతన లేని సమాధానాలివ్వడం, జవాబు దాటవేసేందుకు ప్రయత్నించడం ఈ కేసులో సీరియస్‌గా మారింది. తన కుమారుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం జరిగిందని తండ్రి కేకే సింగ్ పాట్నాలోని పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు నమోదు చేయడంతో రియాను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    రూ.15 కోట్ల దుర్వినియోగం

    రూ.15 కోట్ల దుర్వినియోగం

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకౌంట్‌ నుంచి రూ.15 కోట్ల అక్రమంగా బదిలీ అయ్యాయి. భారీగా డబ్బును దుర్వినియోగం చేశారు అని కేకే సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సుశాంత్ స్థాపించాలనుకొన్న కంపెనీల్లో కొన్ని ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. దాంతో రియాపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కేసు నమోదు చేసి ప్రశ్నిస్తున్నారు. గత నాలుగురోజుల్లో రియాను రెండుసార్లు ప్రతీ రోజు 9 గంటలపాటు ప్రశ్నించారనే విషయం తెలిసిందే.

    అనూహ్యంగా పెరిగిన స్థిరాస్తులు

    అనూహ్యంగా పెరిగిన స్థిరాస్తులు

    ఈడీ పరిశీలనలోకి వచ్చిన సమాచారం ప్రకారం.. 2018-19లో రియా స్థిర ఆస్తులు 96 వేల నుంచి 9 లక్షల రూపాయలకు పెరిగాయి. రియా ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేయడానికి నిధులు ఎలా వచ్చాయనే విషయంపై ప్రశ్నించగా రియా సమాధానాలు చెప్పడానికి నిరాకరించారు. తన అకౌంట్‌లోకి వచ్చిన డబ్బు గురించి ఆరా తీస్తే లెక్కలు చెప్పడానికి నిరాకరించారు.

    ఆదాయానికి మించి షేర్ల కొనుగోలు

    ఆదాయానికి మించి షేర్ల కొనుగోలు

    రియా చక్రవర్తి వార్షిక ఆదాయం మాత్రం కేవలం 18 లక్షలు మాత్రమే ఉన్న సమయంలో 2017-2018 ఆర్థిక సంవత్సరంలో 34 లక్షల మేర షేర్స్ కొనుగోలు చేశారు. 2018లో షేర్ల కొనుగోలు విలువ 34 లక్షల రూపాయల నుంచి 42 లక్షల రూపాయల మేర పెరిగింది అనే విషయాన్ని ఈడీ నుంచి మీడియా సేకరించినట్టు సమాచారం.

    24 నగదు చెల్లించి ఫ్లాట్ కొనుగోలు

    24 నగదు చెల్లించి ఫ్లాట్ కొనుగోలు

    రియా చక్రవర్తి 2018లో ముంబైలోని ఖార్‌లో 24 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఆ నగదుకు సంబంధించిన వివరాల గురించి రియా చక్రవర్తిని ప్రశ్నించగా వాటికి ఆధారాలు చూపడంలో తడబాటు గురయ్యారనే విషయం ఈడీ విచారణలో వెలుగు చూసింది.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    ఆ రెండు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు

    ఆ రెండు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు

    రియా చక్రవర్తికి సంబంధించి ఇలాంటి వ్యవహారాలే కాకుండా హెఛ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్స్ గురించి కూడా ఈడీ ఆరా తీసింది. తన ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంపై ఈడీ ప్రశ్నలు వేయగా వాటికి కూడా సమాధానాలు చెప్పలేక తప్పించుకొనే ప్రయత్నం చేశారనే విషయం బయటకు వచ్చింది. ఇంకా లెక్క తేలని ప్రశ్నలు ఉన్నందున రియా చక్రవర్తిని ఈడీ అధికారులు మరోసారి పిలిచే అవకాశం ఉంది.

    English summary
    Enforcement Directorate has been probing PMLA case against Rhea Chakraborty. As per reports, Rhea's Fixed assets increased leaps and bounds in 2018-19. She Purchased shares worth Rs 34L in 2017-18 when her income was around Rs 18L. Her Share holder fund increased from Rs 34L to Rs 42L in 2018-19.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X