twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజ్ఞాతం వీడిన రియా చక్రవర్తి.. ఈడీ ఆఫీస్‌లో ప్రత్యక్షం.. ముంబై పోలీసులకు మొట్టికాయ

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసును సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తున్నది. మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముంబై పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. సుశాంత్ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా అందజేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. పాట్నాలో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ దాఖలు చేసిన కేసును ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

     అజ్ఞాతం నుంచి రియా చక్రవర్తి

    అజ్ఞాతం నుంచి రియా చక్రవర్తి

    గత వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన రియా చక్రవర్తి కోసం మీడియా, పోలీసులు గాలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భారీ సూట్‌కేసుతో రియా కుటుంబ సభ్యులు నీలం రంగు కారులో గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయారని రియా ఇంటి సిబ్బంది తెలిపారు. పోలీసులతో ఎలాంటి విషయాలను పంచుకోవద్దని రియా కుటుంబం చెప్పిందనే వారు మీడియాకు వెల్లడించారు.

    పీకల్లోతు చిక్కుల్లో రియా కుటుంబం

    పీకల్లోతు చిక్కుల్లో రియా కుటుంబం

    ఇదిలా ఉండగా, గురువారం రాత్రి రియా కుటుంబంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాంతో సుశాంత్ కేసులో రియా చిక్కుకుపోయినట్టే కనిపిస్తున్నది. ఈడీ, సీబీఐ కేసులు వెంటాడుతున్న సమయంలో ఆమె శుక్రవారం మధ్యాహ్నం ఈడీ కార్యాలయంలో కనిపించింది. తప్పనిసరిగా శుక్రవారం విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం కేసులో విచారణకు హజరైంది.

    సాక్ష్యాధారాలు తారుమారు

    సాక్ష్యాధారాలు తారుమారు

    ఆగస్టు 5వ తేదీన ఈ కేసును విచారించిన ధర్మాసనం.. తనకు రక్షణ కల్పించాలని రియా చక్రవర్తి చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. సుశాంత్ మరణం కేసులో సాక్ష్యాధారాలను నాశనం, తారుమారు చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను కాపాడేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముంబై పోలీసులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    క్వారంటైన్‌ పేరుతో హౌస్ అరెస్టా?

    క్వారంటైన్‌ పేరుతో హౌస్ అరెస్టా?

    తాజా విచారణలో బీహార్ పోలీసులతో మహారాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాట్నా ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని క్వారంటైన్ పేరుతో హౌస్ అరెస్ట్ చేయడంపై ఆగ్రహం చేశారు. ఈ కేసు విచారణ విషయంలో ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకొంటున్నారు. పోలీసులై ఉండి మరో రాష్ట్రం పోలీసులతో ఇలా వ్యవహరిస్తే మంచి సందేశం ప్రజల్లోకి వెళ్తుందా అని ప్రశ్నించారు.

    English summary
    Rhea Chakraborty attended to ED Probe for PMLA case in Mumbai: She attended to probe along with his lawyer Satish Manshinde. Sushant Singh Rajput father KK Singh alleges Rhea Chakraborty exploited financially. KK Singh has filed an FIR against Rhea Chakraborty in Rajiv Nagar Police station in Patna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X