‘దిల్ బేచారా’పై ట్విట్టర్ టాక్.. ప్రపంచానికి తెలిసేలా చేద్దాం.. సుశాంత్ ఫ్యాన్స్ ఎమోషనల్

సుశాంత్ సింగ్ మరణం ఒక విషాదం. అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవడం, సుశాంత్ లేడని నిజాన్ని జీర్ణించుకోవడం, ఈ విషాదాన్ని ఆయన అభిమానులు ఇంకా నమ్మలేకపోతున్నారు. సుశాంత్‌ది హత్యేనని, సీబీఐ ఎంక్వైరీ వేయాలని సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రజానీకం, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా పక్కకు పెడితే.. నేడు మాత్రం సుశాంత్‌ను మళ్లీ మనం చూడబోతోన్నాం. సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా నేటి సాయంత్రం విడుదల కాబోతోంది.

 అందరికీ అందుబాటులో..

అందరికీ అందుబాటులో..

సుశాంత్ నటించిన చివరి చిత్రం కావడంతో అందరికీ ఓ ఎమోషన్ ఏర్పడింది. దిల్ బేచారా చిత్రాన్ని కేవలం వినోద సాధకంగా కాకుండా వారి మనసులతో ముడివేసుకున్నారు. అందుకే ట్రైలర్‌ను వరల్డ్ రికార్డుల వరకు తీసుకెళ్లారు. నేడు ఈ చిత్రం విడుదల కాబోతోంది. నేటి సాయంత్రం 7.30 గంటలకు హాట్ స్టార్‌లో అందరికీ అందుబాటులోకి రాబోతోంది.

ఫ్యాన్స్ ఎమోషనల్..

ఫ్యాన్స్ ఎమోషనల్..

దిల్ బేచారా చిత్రంపై ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఈ సమయం కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం నేడు ఈ చిత్రాన్ని అందరూ వీక్షించాలని తద్వారా ప్రపంచానికి సుశాంత్ స్టామినా ఏంటో నిరూపించాలని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఇదే తమరి చివరి సినిమా ఇకపై హిందీ సినిమాలు చూడమని కొందరు అంటున్నారు.

అన్ని రికార్డులు..

అన్ని రికార్డులు..

అన్ని రికార్డులు బద్దలు కొట్టాలని దిల్ బేచారాను అందరం కలిసి సెలెబ్రేట్ చేయాలని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఈ సినిమా క్లిప్పింగ్స్, వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలోపెట్టొద్దని, దయచేసి పైరసీ చేయకండని మరి కొందరు కోరుతున్నారు. ఇక దిల్ బేచారాపై సినీ సెలెబ్రిటీలు కూడా స్పందించారు.

నా జీవితానికి హీరో...

నా జీవితానికి హీరో...

సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి స్పందిస్తూ.. ‘నాలో ఉన్న శక్తినంత కూడబెట్టుకోవాలి నిన్ను చూడాలంటే.. నువ్ నాతో పాటే ఉన్నావ్.. నాకు తెలుసు.. నేను నీ ప్రేమను, నిన్ను సెలెబ్రేట్ చేసుకుంటాను.. నా జీవితానికి హీరోవి నువ్.. మాతో పాటు నువ్ కూడా చూస్తుంటావని నాకు తెలుసు' అని ఎమోషనల్ అయింది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
గౌరవించుకోవాలి..

గౌరవించుకోవాలి..

ప్రముఖ రచయిత చేతన్ భగత్ స్పందిస్తూ.. ‘ఈ రోజు దిల్ బేచారా చిత్రం రిలీజ్ కాబోతోంది. మళ్లీ అతను బతికి వచ్చినట్టు ఉంటుంది. ఎన్నో చిత్రాలు వస్తాయ్ పోతాయ్ గానీ.. ఈ చిత్రం మాత్రమే మ్యాజిక్.. సుశాంత్ మళ్లీ బతికించినట్టు చేస్తుందీ చిత్రం. ఈ రోజు మనమంతా కలిసి సుశాంత్ సింగ్‌ను గౌరవించుకోవాలి' అని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X