రియా చక్రవర్తి పప్పులు ఉడకవు.. సుశాంత్ ఫ్యామిలీ ఫైర్.. 19న సుప్రీంలో సిబీ‘ఐ’

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐకి అప్పగించే కేసు విచారణ సుప్రీంకోర్టులో బుధవారం జరుగనున్నది. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ సోదరిపై రియా చక్రవర్తి తరఫు న్యాయవాది సతీష్ మాన్‌షిండే వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. సుశాంత్ ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో ఆయన సోదరి ప్రియాంక సింగ్ తన బెడ్‌పైకి వచ్చి తనను అసభ్యకరంగా తాకుతూ వేధించిందని ఆరోపణలు చేయడం మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

సుశాంత్ సోదరి ప్రియాంక చేసిన చేసిన నిర్వాకంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుశాంత్‌కు రియాకు మధ్య ఘర్షణ జరిగిందని సతీష్ మాన్‌షిండే తన ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత నా క్లయింట్ రియాకు సుశాంత్ కుటుంబానికి సంబంధాలు చెడిపోయాయి. వారితో మాట్లాడానికి నా క్లయింట్ ఇష్టపడలేదు. కేవలం సుశాంత్‌తో మాత్రమే సఖ్యతతో ఉన్నారు. సుశాంత్ అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరుకావాలనే లాక్‌డౌన్ పరిమితులు ఉండటం కారణంగా అక్కడికి వెళ్లలేదని రియా చక్రవర్తి తరఫు న్యాయవాది సతీష్ మాండే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Sushant Singh Family condemns Rhea Chakrabortys groping allegations

అయితే రియా చక్రవర్తి తరుఫున న్యాయవాది విడుదల చేసిన వ్యాఖ్యలను సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు ఖండించారు. సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించే క్రమంలో రియా ఆడుతున్న నాటకం ఇది. ఇలాంటి నాటకాలు, పప్పులు ఉన్నత స్థానం ముందు ఉడకవు అని సుశాంత్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ అన్నారు. సుశాంత్ కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నీ తెలుసు. ఎలాంటి కుట్రలు జరిగాయనే విషయంపై అందరికీ అవగాహన ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ముంబై పోలీసులు చేపట్టిన దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెరుగుతున్నది. సుశాంత్ కుటుంబ సభ్యులు పాట్నాలో దాఖలు చేసిన కేసు తర్వాత ఈడీ, సీబీఐ దర్యాప్తు ఊపందుకొన్నది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయవద్దని రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీం తుది నిర్ణయం ఆగస్టు 19వ తేదీన వెల్లడించనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X