సుశాంత్ చివరి చిత్రం అందరికీ ఉచితంగా.. ఇది ఎన్నడూ ఊహించలేదన్న డైరెక్టర్

సుశాంత్ సింగ్ మరణ వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేని వారున్నారు. ఇప్పటికే అతని చిరునవ్వ, సేవాగుణం, మంచితనం అందరికీ కళ్ల ముందే మెదులుతోంది. ఆయనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సుశాంత్ గొప్పదనాన్ని చాటి చెప్పే వీడియోలెన్నో అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. అయితే సుశాంత్ చివరగా నటించిన చిత్రంపై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.

Recommended Video

Sushant Singh Rajput’s Last Movie Dil Bechara In Hotstar On July 24 For Free || Oneindia Telugu
సుశాంత్ మృతి..

సుశాంత్ మృతి..

సుశాంత్ సింగ్ మృతిపై ఎన్నో అనుమానాలను వ్యక్త పరుస్తున్నారు నెటిజన్లు. గత కొంత కాలం నుంచి డిప్రెషన్‌లో ఉన్న సుశాంత్ జూన్ 14న తన నివాసంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో రోజుకో చర్చ నడుస్తూనే ఉంది.బాలీవుడ్, నెపోటిజం, కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ వంటి వారి వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఎన్నడూ ఊహించలేదు..

ఎన్నడూ ఊహించలేదు..

దిల్ బేచార దర్శకుడు ముఖేష్ ఛబ్రా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘సుశాంత్ నా తొలి చిత్రానికి కేవలం హీరోనే కాదు.. నా ఎత్తు పల్లాల్లో నాకు తోడుగా నిలుచున్న ప్రాణ స్నేహితుడు. కాయ్ పో చే నుంచి దిల్ బేచార వరకు మేమిద్దరం ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్. నా మొదటి సినిమాలో సుశాంత్ హీరోగా చేస్తానని మాటిచ్చాడు. మేమిద్దరం కలిసి ఎన్నో ప్లాన్స్ వేశాము..ఎన్నో కలలు కన్నాము. కానీ చివరకు ఇలా సుశాంత్ లేకుండా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తానని ఎన్నడూ ఊహించలేదు.

మిస్ యూ..

మిస్ యూ..

అతడిని, అతడి ప్రతిభను సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇంత కంటే మంచి దారి లేదు. ఈ చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో నాపై ఎంతో ప్రేమను కురిపించాడు. అతని ప్రేమే నేడు ఇలా విడుదల చేసేందుకు మమ్మల్ని కదిలించింది. ప్రతీ ఒక్కరూ ఉచితంగా చూసేలా నిర్మాతలు నిర్ణయం తీసుకోవడం నాకు సంతోషంగా ఉంది. మేమంతా కలిసి పండుగలా సెలెబ్రేట్ చేసుకోబోతోన్నాము సుశాంత్. పై నుంచి నీ చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్విదించే ఆ విజువల్‌ను నేను ఊహించుకోగలుగుతున్నాను.. మిస్ యూ' అని అందర్నీ కంటతడి పెట్టించాడు.

అందరికీ ఉచితంగా..

అందరికీ ఉచితంగా..

సుశాంత్ చివరగా నటించిన దిల్ బేచార చిత్రాన్ని హాట్ స్టార్‌లో జూలై 24న విడుదల చేయబోతోన్నారు. అయితే ఈ చిత్రాన్ని హాట్ స్టార్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నా, చేసుకోకపోయినా ప్రతీ ఒక్కరూ చూసేలా ఉచితంగానే అందిస్తున్నారు. ఇదే సుశాంత్‌కు ఇచ్చే నివాళి అని యూనిట్ తెలుపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X