షాకింగ్‌గా రియా చక్రవర్తి కుట్రలు.. సోదరుడితో కలిసి 40 కోట్లు కాజేసి.. బ్యాంక్ స్టేటుమెంట్ లీక్
సుశాంత్ సింగ్ మృతి తర్వాత రియా చక్రవర్తి లీలలను ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కొటిగా బయటపెడుతున్నారు. తాజాగా ఫ్యామిలీ మెంబర్స్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత చాలా విషయాలు షాకింగ్ గురిచేస్తున్నాయి. తాజాగా రిపబ్లిక్ టెలివిజన్ చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. తాజా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను రిపబ్లిక్ బయటపెట్టగా అందులో వెల్లడైన విషయాలు మీ కోసం..
Recommended Video

సోదరుడితో కలిసి డబ్బు విచ్చలవిడిగా
సుశాంత్ సింగ్‌తో అఫైర్ మొదలైన తర్వాత గత ఏడాది నుంచి బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించగా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి విచ్చలవిడిగా డబ్బును వాడుకొన్నట్టు స్పష్టమైంది. రియా ఫ్లయిట్ టికెట్స్, హెయిర్ కటింగ్, మేకప్, షాపింగ్, పార్లర్ ఖర్చుల కోసం సుశాంత్ డబ్బును విచ్చల విడిగా వాడుకొన్నట్టు వెల్లడయ్యాయి.

దాదాపు 40 కోట్లకుపైగా
సుశాంత్ సింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి 40 కోట్లకుపైగా దుర్వినియోగం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నవంబర్ 2019 లో సుశాంత్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.4.6 కోట్లుగా ఉండేది. ఆ మొత్తం 2020 ఫిబ్రవరి నాటికి రూ.1 కోటి రూపాయలకు పడిపోయింది. ఎక్కువ మొత్తంగా రియా, ఆమె సోదరి షోవిక్ కోసం ఖర్చు చేసినట్టు స్పష్టమైంది. షోవిక్ చక్రవర్తి ఫ్లయిట్ టికెట్స్ కోసం రూ.81 వేలు, పార్లర్ ఖర్చుల కోసం 1లక్ష, తన సోదరుడి హోటల్ ఖర్చులు రూ.4 లక్షల వాడుకొన్నట్టు రిపబ్లిక్ టీవీ సంపాదించిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో స్పష్టమైంది.

15 కోట్లు అక్రమంగా ట్రాన్స్‌ఫర్
రియా చక్రవర్తి చేసిన డబ్బు దుర్వినియోగంపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ మాట్లాడుతూ.. నా కుమారుడి అకౌంట్ నుంచి రూ.15 కోట్ల రూపాయలు మరో అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఆ అకౌంట్‌కు తన కుమారుడిక ఎలాంటి సంబంధం లేదు అని ఆరోపించారు.

పథకం ప్రకారం కుట్రగా
సుశాంత్‌ను వలలో వేసుకొని బాలీవుడ్‌లో సక్సెస్ సాధించాలని రియా చక్రవర్తి కుట్ర పన్నింది. ఆ మేరకు తన కుమారుడిని బుట్టలో వేసుకొన్నది. నా కుమారుడి ప్రతీ నిర్ణయంలోను, జీవితంలోనూ జోక్యం చేసుకొన్నది. నా కొడుకు ఆస్తిని కాజేయాలనే కుట్ర పన్నింది అని కేకే సింగ్ ఆరోపించారు.

రంగంలోకి ఈడీ.. అవకతవకలపై దర్యాప్తు
సుశాంత్ బ్యాంక్ అకౌంట్లలో జరిగిన అవకతకవలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ మేరకు బీహార్ పోలీసులను ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని అధికారులు కోరారు. సుశాంత్ డబ్బు, బ్యాంకు అకౌంట్లను మరే రూపంలోనైనా దుర్వినియోగం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నాం. ఆయన సొమ్మును మనీ లాండరింగ్, చట్ట వ్యతిరేకంగా ఆస్తులను, అక్రమ ఆస్తుల కొనుగోలు జరిగిందా అని పరిశీలిస్తాం అని అధికారుల పేర్కొన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











