మరోసారి దొరికిపోయిన సినీ జంట: యంగ్ హీరోయిన్‌తో ఆ ఇంట్లో కాపురం.. స్టార్ హీరో ప్లాన్.!

By Lekhana

సాధారణంగా లవ్ ఎఫైర్ల గురించి ఏదైనా వార్తలు వస్తే అవి ఎంతగా హాట్ టాపిక్ అవుతుంటాయో తెలిసిందే. అది కూడా సినీ ఇండస్ట్రీలోని మేటర్లు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ తరహా కథలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అక్కడ లవ్ ట్రాకులు నడిపే వారి సంఖ్య లెక్కించడం కష్టం. అలాంటి వారిలో ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్న ఈ సినీ జంట.. తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇక, ఇప్పుడైతే సదరు హీరో ఓ ఊహించని పని చేశాడు. ఆ వివరాలేంటో చూద్దాం.

 క్రికెటర్‌గా వచ్చి.. ఫేమస్ అయిపోయాడు

క్రికెటర్‌గా వచ్చి.. ఫేమస్ అయిపోయాడు

‘కోయి పో చే' సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఈ సినిమా తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ తగిన గుర్తింపును దక్కించుకోలేకపోయాడు. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్‌లో నటించి అందరి దృష్టిలో పడ్డాడు. ఈ సినిమా కోసం పడిన కష్టంతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.

మహేశ్ బాబు హీరోయిన్‌తో ప్రేమాయణం

మహేశ్ బాబు హీరోయిన్‌తో ప్రేమాయణం

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే'లో హీరోయిన్‌గా చేసిన కృతీసనన్‌తో సుశాంత్ ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. చాలా కాలం పాటు వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని మరీ తిరిగారు. ఈ విషయం బహీర్గతం అయ్యాక కూడా కంటిన్యూ చేశారు. తర్వాత ఏమైందో ఏమో ఈ జంట విడిపోయింది.

మరో టాలీవుడ్ హీరోయిన్‌తో రొమాన్స్

మరో టాలీవుడ్ హీరోయిన్‌తో రొమాన్స్

తెలుగులో ‘తూనీగ తూనీగ' అనే సినిమాలో నటించిన రెహా చక్రవర్తితో సుశాంత్ ప్రేమాయణం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ జంట ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అంతేకాదు, ముంబైలోనే తరచూ కలుస్తూ కెమెరాల కంటికి చిక్కుతోంది. దీంతో వీళ్లిద్దరి ప్రేమాయణం బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి ఈ సినీ జంట మరింతగా రెచ్చిపోతూ ఎంజాయ్ చేస్తోంది.

యంగ్ హీరోయిన్‌తో ఆ ఇంట్లో కాపురం

యంగ్ హీరోయిన్‌తో ఆ ఇంట్లో కాపురం

కొన్నేళ్లుగా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. అతడు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతుండడంతో మార్కెట్‌ను కూడా పెంచుకోగలిగాడు. దీంతో ఇటీవల ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. బాంద్రా సమీపంలో నిర్మించిన ఆ ఇంట్లో రెహా చక్రవర్తితో కాపురం పెట్టబోతున్నాడట ఈ స్టార్ హీరో.

మరోసారి దొరికిపోయిన సినీ జంట.. హీరో ప్లాన్

మరోసారి దొరికిపోయిన సినీ జంట.. హీరో ప్లాన్

తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గృహ ప్రవేశం చేశాడు. ఈ కార్యక్రమానికి కొందరు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారట. వారిలో రెహా చక్రవర్తి కూడా ఉందని సమాచారం. బీ టౌన్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకారం... త్వరలోనే రెహాను వివాహమాడి ఈ ఇంట్లోనే కాపురం పెట్టాలని ప్లాన్ చేశాడట సుశాంత్. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.

Recommended Video

Director SS Rajamouli Launched The Telugu Logo Of 'Brahmastra' | Filmibeat Telugu
 తెలుగు ప్రొడ్యూసర్ కొడుకుతో మొదలెట్టింది

తెలుగు ప్రొడ్యూసర్ కొడుకుతో మొదలెట్టింది

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ నటించిన తొలి చిత్రం ‘తూనీగ తూనీగ'తో ఇండస్ట్రీకి పరిచయమైంది రెహా చక్రవర్తి. ఈ సినిమా తర్వాత ఆమె నేరుగా బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. అక్కడ పలు చిత్రాలు చేసి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ... ఆ తర్వాత కొన్ని టీవీ షోలలో పాల్గొనడంతో పాపులర్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X