సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో బాలీవుడ్ హీరోకు సమన్లు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చేపట్టిన డ్రగ్స్ రాకెట్ దర్యాప్తులో మరో సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసుకు సంబంధించిన ప్రముఖులను అరెస్ట్ చేస్తూ ఎన్సీబీ కొరడా ఝులిపిస్తున్నది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రియరాలి సోదరుడు ఏజిసిలోస్ డేమిట్రియాడెస్ అరెస్ట్ తర్వాత మరో యువ హీరోకు సమన్లు జారీ చేయడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఎన్సీబీ అధికారులు జారీ చేసిన ఆ యువ నటుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

దీపిక, రకుల్, సారా, శ్రద్దా విచారణ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సమన్లు జారీ చేశారు. దీపికా పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ఫ్రీత్ సింగ్ తదితరులు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ధర్మ ప్రొడక్షన్ మాజీ ఉద్యోగిని అరెస్ట్ చేయడం జరిగింది.

అర్జున్ రాంపాల్ సన్నిహితుడి అరెస్ట్
డ్రగ్స్ కేసులో విచారణను కొనసాగిస్తున్న ఎన్సీబీ అధికారులు నిషేధిత మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు సన్నిహితుడు ఏజిసిలోస్ డేమిట్రియాడెస్‌ను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, శ్యామ్యూల్ మిరాండాను అరెస్ట్ చేసిన CIR 16/20 కేసులోనే ఏజిసిలోస్ అరెస్ట్ చేయడం గమనార్హం.

బాలీవుడ్ యువ హీరోకు సమన్లు
ఇదే కేసులో మరో యువ హీరోకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే ఆ యువ హీరో తన ఆచూకీ తెలియకుండా తప్పించుకు తిరుగుతుండటంతో అధికారులు వేట మొదలుపెట్టారు. అతని ఆచూకీ కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ యువ హీరో పేరును గోప్యంగా పెట్టి దర్యాప్తు చేయడం మరింత ఆసక్తిగా మారింది.

ఆఫ్రికా దేశస్తుడి అరెస్ట్‌తో లింకు..
బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన ఏజిసిలోస్ డేమిట్రియాడెస్ అరెస్ట్ తర్వాత ఆఫ్రికాకు చెందిన మరో డ్రగ్స్ సప్లయర్‌ని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికా దేశస్థుడిని డ్రగ్స్ రాకెట్ సంబంధాలపై విచారిస్తున్నారు. ఈ క్రమంలో మరికొందరి పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తున్నది.
Recommended Video

ఎన్సీబీపై సుశాంత్ పని మనిషి కేసు
ఇదిలా ఉండగా, డ్రగ్ రాకెట్ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటి పని మనిషి దీపేష్ సావంత్ ఎన్సీబీపై పరువు నష్టం దావాను వేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసినందుకు గాను రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనను అరెస్ట్ చేసిన 24 గంటలలోపు కోర్టులో హాజరుపరుచలేదని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు.


Click it and Unblock the Notifications











