twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ మరణం కేసులో మరో ట్విస్టు.. కొత్త టెక్నాలజీతో అంటూ బీజేపీ ఎంపీకి వివరణ ఇచ్చిన సీబీఐ

    |

    అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తు సుదీర్ఘంగా అనేక మలుపులతో కొనసాగుతున్నది. ఈ కేసులో అనేక కోణాల్లో సీబీఐ, ఈడీ, ఎన్సీబీ లాంటి సంస్థలు ఇప్పటికే కొంత పురోగతిని సాధించాయి. అయితే ఈ కేసులో అనేక అనుమానాల్ని వ్యక్తం చేస్తున్న బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామికి సీబీఐ వివరణ ఇస్తూ...

    బాలీవుడ్‌ను కుదిపేసిన మరణం

    బాలీవుడ్‌ను కుదిపేసిన మరణం


    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ కేసులో ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగాయి. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు, మరికొంత మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.

    ప్రధాని, హోంమంత్రికి బీజేపీ ఎంపీ లేఖ

    ప్రధాని, హోంమంత్రికి బీజేపీ ఎంపీ లేఖ

    బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ మరణం సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ కేసును నిశితంగా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలి అంటూ ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాకు సుబ్రమణ్యస్వామి లేఖ రాయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్వామికి సీబీఐ క్లారిటీ ఇచ్చింది.

    సుబ్రమణ్యస్వామికి సీబీఐ క్లారిటీ

    సుబ్రమణ్యస్వామికి సీబీఐ క్లారిటీ


    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణ ఇంటెన్సివ్‌గా కొనసాగుతున్నది. ఈ కేసును పలు కోణాల్లో విచారిస్తున్నాం. ఈ కేసులో అడ్వాన్స్‌డ్ ఫోరెన్సిక్ ఎక్విప్‌మెంట్ ఉపయోగిస్తున్నాం. పలు ప్రాంతాల్లోని సెల్ టవర్ల నుంచి డేటా సేకరిస్తున్నాం అని సీబీఐకి ఎస్పీ నుపూర్ ప్రసాద్ తెలిపారు.

    లేటెస్ట్ టెక్నాలజీతో కేసు దర్యాప్తు

    లేటెస్ట్ టెక్నాలజీతో కేసు దర్యాప్తు

    సుశాంత్ సింగ్ మరణం కేసులో ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టకుండా.. పూర్తిస్థాయిలో లేటెస్ట్ సైంటిఫిక్ టెక్నాలజీతో అత్యంత ప్రొఫెషనల్‌గా దర్యాప్తు చేస్తున్నాం. ఈ దర్యాప్తులో మాకు చాలా విషయాలు మా దృష్టికి వచ్చాయి. ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా దర్యాప్తు చేస్తున్నాం. ప్రతీ అంశాన్ని కీలకంగా పరిశీలిస్తున్నాం అని నుపూర్ ప్రసాద్ పేర్కొన్నారు.

    జూన్ 14వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో

    జూన్ 14వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో

    బాలీవుడ్‌లో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా అగ్రహీరోగా రాణిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను అనూహ్య పరిస్థితుల్లో జూన్ 14వ తేదీన ముంబైలోని తన అపార్ట్‌మెంట్లో ఉరి వేసుకొని మరణించడం సంచలనంగా మారింది. ఆయన మరణం వ్యవహారంలో ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వంపై పలువురు సంచలన ఆరోపణలు చేయడంతో ఈ కేసు సీబీఐకి అప్పగించడం జరిగిన విషయం తెలిసిందే.

    English summary
    Sushant Singh Rajput case: CBI clarity to BJP MP Subramanian Swamy. CBI's SP Nupur Prasad told to Subramanian Swamy that The CBI is investigating thoroughly and professionally using the latest scientific techniques.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X