సుశాంత్ కేసులో కంగనకు ఎట్టకేలకు నోటీసులు.. ఇరుకున పడ్డ సిబ్బంది
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తు విషయంలో బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ను ప్రశ్నించే వ్యవహారంలో జరిగిన హైడ్రామాకు తెరపడింది. ఎట్టకేలకు కంగనకు ముంబై పోలీసులు నోటీసులు పంపించారు. ఈ కేసు దర్యాప్తులో విచారణకు హాజరై స్టేట్‌మెంట్ రికార్డుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు మనాలిలోని సొంత ఇంటిలో ఉన్న కంగనకు నోటీసులు పోస్టు చేశారు. ఈ విషయంలో గత రెండు రోజులుగా జరిగిన గందరగోళం ఏమిటంటే..

సుశాంత్ మరణంపై కంగన అనుమానాలు
లాక్‌డౌన్ సమయంలో కంగన రనౌత్ ముంబై నుంచి తన మకాంను హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి మార్చారు. తన సొంత నివాసంలో ఉన్న ఉంటున్నారు. అక్కడి నుంచి సుశాంత్ సింగ్ సుసైడ్ గురించి తన అనుమానాలను వీడియో, ట్వీట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులపై ఆమె చేస్తున్న ఆరోపణలు మీడియాలో సంచలనం రేపుతున్నాయి.

సిబ్బంది నోటీసుల నిరాకరణ
ఇలాంటి పరిస్థితుల మధ్య సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు కంగన రనౌత్‌కు నోటీసులు జారీ చేసేందుకు జూలై 3 తేదీన ముంబైలోని నటి ఇంటికి వెళ్లారు.అయితే సిబ్బందిలో ఒకరైన అమృత దత్ పోలీసుల నోటీసులు స్వీకరించడానికి నిరాకరించారు. కంగన ఊర్లో లేరని తాను నోటీసులు తీసుకోలేని స్పష్టం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఒకవేల నోటీసులు స్వీకరించకపోతే బాంద్రా పోలీసులకు రావాలని కోరితే వారి ఆదేశాలను ఆమె తిరస్కరించారు.

ఫోనులో సంప్రదింపులకు కంగన నో..
ఇక సుశాంత్ కేసులో విచారణకు హాజరుకావాలని కంగన రనౌత్ సోదరి, ఆమె మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రంగోలి చండేల్‌తో ఫోనులో సంప్రదింపులు చేపట్టారు. అయితే అధికారికంగా నోటీసులు పంపితే తప్ప మేము విచారణకు హాజరుకాలేమని రంగోలి స్పష్టం చేశారు. దాంతో ఈ వ్యవహారం గందరగోళంగా మారింది. కంగనకు నోటీసులు ఇచ్చామని.. లేదు మాకు నోటీసులు ఇవ్వలేదని కంగన టీమ్ విరుద్ధంగా ట్వీట్లు చేశారు.
Recommended Video

మనాలి ఇంటి అడ్రస్‌కు నోటీసులు
సుశాంత్ సింగ్ సూసైడ్ విచారణ విషయంలో జరుగుతున్న గందరగోళానికి ముంగింపు పలుకుతూ గురువారం ఎట్టకేలకు కంగనరనౌత్‌కు నోటీసులను మనాలిలోని ఇంటి అడ్రస్‌కు పంపించారు. ప్రస్తుతం మా బృందం సభ్యులు మనాలికి రాలేని పరిస్థితి. కాబట్టి నోటీసులు పంపిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. అయితే గతకొద్దికాలంగా పోలీసులు ప్రశ్నలు పంపితే వాటికి వీడియో రూపంలో గానీ, మరో రూపంలో గానీ సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని కంగన స్పష్టం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











