twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ మృతి వెనుక భారీ కుట్ర.. సీబీఐకి అప్పగించాలి.. గళమెత్తిన బీజేపీ ఎంపీ, ఫ్యామిలీ

    |

    బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు మరో మలుపు తిరిగింది. సుశాంత్ సింగ్ మరణానికి కారణంపై ముంబై పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై ఆయన కుటుంబ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ సోమ, మంగళవారాల్లో బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తు డ్రామా ముంబై నుంచి బీహార్‌కు మారింది. ఈ కేసు తాజా మలుపు గురించిన విషయాల్లోకి వెళితే..

    సుశాంత్ మరణం వెనుక కుట్ర

    సుశాంత్ మరణం వెనుక కుట్ర

    డిప్రెషన్ కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించారనే కారణంతో కేసు దర్యాప్తును ముగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆయన కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. అయితే తమ కుమారుడి మరణం వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు సోమ, మంగళవారం బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    సుశాంత్ ఎలాంటి సమస్యలు లేవు

    సుశాంత్ ఎలాంటి సమస్యలు లేవు

    సుశాంత్ సింగ్‌ ఎలాంటి డిప్రెషన్2తో బాధపడటం లేదు. మాకు తెలిసి ఆయనకు ఎలాంటి ఆరోగ్య, శారీరక, మానసిక సమస్యలు లేవు. కానీ బాలీవుడ్ వర్గాలు సుశాంత్‌కు డిప్రెషన్ ఉందనే కారణం చూపుతూ ఆయన మరణం వెనుక ఉన్న చీకటి కోణాన్ని బయటకు రాకుండా చేస్తున్నారు. ఈ విషయంపై నిశితంగా దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

    ముంబైకి బీహార్ పోలీసుల బృందం

    ముంబైకి బీహార్ పోలీసుల బృందం

    దీంతో సుశాంత్ సింగ్ మృతి వెనుక కారణాలపై దర్యాప్తు చేయడానికి 4 పోలీసులను బీహార్ పోలీసు శాఖ రంగంలోకి దించింది. వారిని దర్యాప్తు కోసం ముంబైకి పంపించారు. ఈ కేసు విచారణలో వాస్తవాలను బయటకు తీసేందుకు నలుగురితో కూడిన బృందం ముంబైకి చేరుకొన్నది. ఈ నేపథ్యంలో కేసు విచారణపై ఆసక్తి పెరిగింది.

    మహా సీఎంకు బీజేపీ ఎంపీ ట్వీట్

    మహా సీఎంకు బీజేపీ ఎంపీ ట్వీట్

    సుశాంత్ కేసుపై బీజేపీ ఎంపీ స్పందిస్తూ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేకు జన్మదిన శుభాకాంక్షలు. మీకు చేతులు జోడిస్తూ వేడుకొనేది ఒకటే. సుశాంత్ మరణించి 43 రోజుల తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. కాబట్టి ఈ కేసును సీబీఐకి ట్రాన్స్‌ఫర్ చేయాలని బీజేపీ ఎంపీ, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ ట్వీట్ చేశారు. మీరు లక్షలాది మంది సుశాంత్ అభిమానులు ఆవేదనను అర్థం చేసుకొంటారని అనుకొంటాను అని తివారీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    సుశాంత్ కుటుంబం అసంతృప్తితో

    సుశాంత్ కుటుంబం అసంతృప్తితో

    ఇదిలా ఉండగా, సుశాంత్ సూసైడ్ కేసు విచారణపై బీజేపీ ఎంపీ మనోజ్ తీవారీ మాట్లాడుతూ.. సుశాంత్ కుటుంబాన్ని కలిశాను. వారు ఈ కేసు దర్యాప్తు తీరుపై అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఈ కేసు విచారణ జరగబట్టి 43 రోజులు అవుతున్నది. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటూ మనోజ్ తివారీ అన్నారు.

    English summary
    Sushant Singh Rajput case: MP Manoj Tiwari rises voice for CBI investigation. He tweeted that, I request with folded hands to give justice to Sushant who died 43 days ago, but no FIR has been registered so far. Mean while, Sushant Singh Rajput's family approached Bihar Police on Monday and on Tuesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X