twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ లవర్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. బ్యాంక్ అకౌంట్ నుంచి భారీగా డబ్బు..

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు వేగం పెంచారు. శనివారం రోజు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. అనూహ్యంగా యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాను విచారించడంతోపాటు సుశాంత్ లవర్, హీరోయిన్ రియా చక్రవర్తిని మరోసారి విచారించాలని బాంద్రా పోలీసులు నిర్ణయం తీసుకోవడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపింది. వివారాల్లోకి వెళితే..

    Recommended Video

    Sushant Singh Rajput : Sushant డబ్బుతో యూరప్ వెళ్లిన Rhea..గత 11 నెలల్లో భారీ మొత్తం లో డబ్బు డ్రా !
    గతంలో తొమ్మిది గంటలపాటు

    గతంలో తొమ్మిది గంటలపాటు

    సుశాంత్ సూసైడ్ కేసులో గతంలో రియా చక్రవర్తిని గతంలో బాంద్రా పోలీసులు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. లాక్‌డౌన్ సహజీవనం, వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి పలు ప్రశ్నలు సంధించారనే వార్తలు వచ్చాయి. అలాగే సుశాంత్ డిప్రెషన్ గురించి అడిగి తెలుసుకొన్నారు. అయితే తాజాగా సుశాంత్ చేత రియా పెట్టించిన ఖర్చు వివరాలపై కూపీ లాగేందుకు సిద్ధమయ్యారు.

    యాడ్ షూటింగ్ కోసం యూరప్‌కు

    యాడ్ షూటింగ్ కోసం యూరప్‌కు

    గతంలో ఓ యాడ్ షూటింగ్ కోసం రియా యూరప్ వెళ్లారు. అయితే ఆమె ఫ్లయిట్ టికెట్స్ మాత్రమే భరిస్తే.. మిగితా ఖర్చు అంతా సుశాంత్ పెట్టుకొన్నారు. విలాసవంతంగా ఆ టూర్‌లో భారీ మొత్తంలో ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది. రియాకు సంబంధించిన అన్ని ఖర్చులను సుశాంత్ భరించారనే విషయం వెలుగులోకి వచ్చింది.

    సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి

    సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి

    అంతేకాకుండా గత 11 నెలల్లో సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రియా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశారు. ఆయన డబ్బు ఉపయోగించి విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేసింది అనే విషయం బయటకు వచ్చింది. అయితే సుశాంత్ అకౌంట్ నుంచి ఎంత మొత్తం డబ్బును రియా ఉపయోగించుకొన్నదనే విషయంపై ఆమెను ముంబై పోలీసులు ప్రశ్నించనున్నారు.

    డిప్రెషన్‌కు చికిత్స జరిగినప్పుడు

    డిప్రెషన్‌కు చికిత్స జరిగినప్పుడు

    ఇదిలా ఉండగా, గతంలో విచారించినప్పుడు సుశాంత్ తన డిప్రెషన్‌కు కౌన్సెలింగ్ తీసుకొన్నప్పుడు ఆయన వెంట రియా తోడుగా వెళ్లారు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందనే విషయం గురించి అడిగి తెలుసుకొన్నారు. ఈ క్రమంలో తాజాగా సుశాంత్‌ డిప్రెషన్‌కు చికిత్స అందించిన డాక్టర్‌ను కూడా విచారించారు. ఈ క్రమంలో మరోసారి రియాను విచారించాలని నిర్ణయం తీసుకోవడం సర్వత్ర చర్చనీయాంశమైంది.

    English summary
    Sushant Singh Rajput Case: Mumbai Police call Rhea Chakraborty for interrogation. Bollywood's Talent Manager Reshma Shetty questioned for 5 hours by Mumbai polices in Sushant Singh Rajput Suicide case. Till now, Bandra Police recorded 35 members statements in this case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X