twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం.. రియా చక్రవర్తికి మరో ఊరట

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సుశాంత్ సింగ్‌ది హత్య కాదు.. ఆత్మహత్యే అంటూ దర్యాప్తు సంస్థలు ధృవీకరిస్తున్నాయి. ఈ క్రమంలో రియా చక్రవర్తికి సంబంధించిన మరో విషయం కూడా బయటకు వచ్చింది.

    సుశాంత్ సింగ్ మరణం తర్వాత తన కుమారుడు బ్యాంక్ అకౌంట్ల నుంచి రియా చక్రవర్తి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసిందని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈడీ, సీబీఐ, ఎన్సీబీ లాంటి సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు చేశాయి.

    సుశాంత్ సింగ్ రాజ్‌ మరణంలో హత్య కోణం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. కాబట్టి తాము ఆత్మహత్య, అందుకు ప్రేరేపించిన కారణాల దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు సీబీఐ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. అలాగే కేకే సింగ్ ఆరోపించినట్టుగా రియా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఆడిట్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆ కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయంపై స్పష్టత కానరాలేదు అని సీబీఐ వర్గాలు వెల్లడించినట్టు ఇండియాటుడే కథనాన్ని వెల్లడించింది.

    Sushant Singh Rajput case: No proof of Rhea Chakrabortys money fraud allegations

    అంతేకాకుండా సుశాంత్ మేనేజర్ దిశా సలియాన్, సుశాంత్ మరణానికి లింకు ఉన్నట్టు వస్తున్న వార్తలకు సంబంధించి బలమైన ఆధారాలు లభించలేవు అని సీబీఐ అధికారులు చెప్పినట్టు కథనంలో పేర్కొన్నది.

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఊహించని పరిస్థితుల్లో జూన్ 14వ తేదీన తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించడం అందర్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆ సమయంలో యాక్సిడెంటల్ మరణంగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Enforcement Directorate summoned for questioning Rhea Chakraborty on August 7. ED is going to question money laundering case related to actor Sushant Singh. After investigation, Reports suggest that CBI sources reaveled that There is no proof to suggest that Rhea Chakraborty siphoned off money from Sushant Singh Rajput's bank account.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X