twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sushant Singh Rajput death కేసులో బిగుస్తున్న ఉచ్చు.. తెరపైకి కీలక వ్యక్తి పేరు.. ఎన్సీబీ దర్యాప్తులో సంచలనాలు

    |

    బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు విచారణను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వేగం పెంచింది. ఈ కేసులో తాజాగా అరెస్ట్ చేసిన అతడి రూంమేట్ సిద్దార్థ్ పితానిని గత కొద్ది రోజులుగా విచారించగా సంచలన విషయాలు వెల్లడించినట్టు సమాచారం. సుశాంత్ టీమ్‌లో కీలకంగా వ్యవహరించిన సిద్దార్థ్ పితానిని మే 28వ తేదీన హైదరాబాద్‌లో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజా విచారణలో వెలుగు చూసిన విషయాలు ఏమిటంటే....

    కీలక విషయాలను వెల్లడించిన సుశాంత్

    కీలక విషయాలను వెల్లడించిన సుశాంత్


    జాతీయ మీడియాకు ఎన్సీబీ అధికారులు వెల్లడించినట్టుగా వస్తున్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ముంబైకి తరలించిన సిద్దార్థ్ పితానిని పలు కోణాల్లో ప్రశ్నించగా.. సుశాంత్ మరణానికి సంబంధించి, డ్రగ్స్ వ్యవహారాల గురించి సంచలన విషయాలను బయటపెట్టినట్టు తెలిసింది.

    తెరపైకి శ్యాముల్ మిరాండా పేరు

    తెరపైకి శ్యాముల్ మిరాండా పేరు

    సిద్దార్థ్ పితానిని విచారించగా తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటి మేనేజర్‌గా వ్యవహరించిన శామ్యూల్ మిరాండా పేరును బయటపెట్టినట్టు తెలిసింది. శ్యామూల్ మిరాండా వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ఈ కేసులో అతడిని మరోసారి విచారించే అవకాశం ఉందనే మాట మీడియా వర్గాల్లో వినిపిస్తున్నది.

    మరికొందరికి సమన్లు జారీ

    మరికొందరికి సమన్లు జారీ

    అంతేకాకుండా సుశాంత్ మరణం కేసులో సంచలన విషయాలు వెలుగు చేస్తున్న క్రమంలో మరోసారి పలువురిని ప్రశ్నించేందుకు సమన్లు కూడా జారీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారనే విషయం ముంబై మీడియాలో వినిపిస్తున్నది. అయితే ఈ దర్యాప్తుపై అధికారులు గుంభనంగా వ్యవహరించడం గమనార్హం.

    గుర్తు తెలియని ప్రదేశానికి నిందితులను

    గుర్తు తెలియని ప్రదేశానికి నిందితులను


    సుశాంత్ సింగ్ వంట, పని మనుషులు కేశవ్, నీరజ్‌కు గత రెండు రోజుల క్రితం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా వారిని విచారిస్తున్న అధికారులకు కీలక సమాచారం లభించినట్టు తెలుస్తున్నది. విచారణలో భాగంగా కేశవ్‌ను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నించారని తెలిసింది. అయితే వారిని ఇంకా అరెస్ట్ చేయలేదని అధికారులు ధృవీకరించారు.

    Recommended Video

    Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
    క్రైమ్ నంబర్ 7‌లో సిద్దార్థ్ అరెస్ట్ అంటూ...

    క్రైమ్ నంబర్ 7‌లో సిద్దార్థ్ అరెస్ట్ అంటూ...


    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో క్రైమ్ నంబర్ 7 సంబంధించిన లింక్ సిద్దార్థ్ పితానికి ఉంది. ఈ కేసులో సిద్దార్థ్ కీలకంగా మారారు. ఈ కేసులో సిద్దార్థ్ పితాని జూన్ 4వ తేదీ వరకు తమ కస్టడీలో ఉంటారు అని అధికారులు మీడియాకు తెలిపారు.

    English summary
    Bollywood actor Sushant Singh Rajput death case investigation going with fast note by NCB. Reports suggest that Siddarth Pithani reveals Samuel Miranda role in this case. Samuel was former manager to Sushant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X