సుశాంత్ సూసైడ్ కొత్త కోణం.. బలిపశువుగా ప్రియురాలు.. ఇప్పుడు అందరి అనుమానం ఆమెపైనే!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. సుశాంత్‌తో సంబంధాలున్న ప్రతీ ఒక్కరిని గంటల తరబడి విచారిస్తున్నారు. తాజా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని తొమ్మిది గంటలపాటు విచారించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సుదీర్ఘమైన విచారణలో అనేక విషయాలను రియా పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. లాక్‌డౌన్ కలిసి ఉన్న తాము ఎందుకు గొడవ పడ్డామనే విషయాన్ని సవివరంగా చెప్నినట్టు తెలుస్తున్నది. అయితే రియా వ్యవహరించిన తీరే సుశాంత్ తీవ్రమైన నిర్ణయం తీసుకొనేందుకు దారి తీసిందా? అనే ప్రశ్న మొదలైంది...

సుమారు తొమ్మిది గంటలపాటు విచారణ

సుమారు తొమ్మిది గంటలపాటు విచారణ

ఇటీవల తొమ్మిదిగంటల విచారణలో రియా చెప్పినదేమిటంటే.. గత కొద్దికాలంగా సుశాంత్, తాను డేటింగ్ చేస్తున్నామని, అయితే పెళ్లి కూడా చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. లాక్‌డౌన్‌లో సుశాంత్, తాను సహజీవనం చేసిన మాట వాస్తమనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. అయితే సుశాంత్ నివాసంలో అతడి స్నేహితుడు సిద్దార్థ్ పితానితో కలిసి ఉన్నామని వెల్లడించింది.

సుశాంత్ నివాసంలో స్నేహితుడు సిద్ధార్థ్ పితాని

సుశాంత్ నివాసంలో స్నేహితుడు సిద్ధార్థ్ పితాని

అయితే సుశాంత్‌తో సహజీవనం చేస్తున్న సమయంలో ఆయన స్నేహితుడు సిద్దార్థ్ పితాని తమ మధ్య ఉండటం ఇష్టం లేదని చెప్పాను. అయితే అందుకు సుశాంత్ నిరాకరించాడు. ఆ కారణంగా మా మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగానే నేను సుశాంత్‌ దూరమయ్యాను. లాక్‌డౌన్ తర్వాత సుశాంత్‌ నివాసం నుంచి బయటకు వచ్చాను. అప్పటి నుంచి తాను మళ్లీ కలువలేదు. కానీ ఫోన్‌లో టచ్‌లో ఉన్నామని పోలీసులకు చెప్పినట్టు సమాచారం.

పితాని విషయంలో సుశాంత్‌తో గొడవ

పితాని విషయంలో సుశాంత్‌తో గొడవ

అయితే స్నేహితుడు పితాని విషయంలో తనకు, సుశాంత్‌కు గొడవ జరిగింది. అయితే తమ మధ్య పితాని ఉండటం ఇష్టం లేకనే నేను ఇంటి నుంచి బయటకు వెళ్లున్నాననే విషయాన్ని సుశాంత్ సోదరికి ఫోన్ చేసి చెప్పినట్టు పోలీసులకు రియా వెల్లడించినట్టు తెలిసింది. తమ అఫైర్ విషయం సుశాంత్ ఇంట్లో వారికి తెలుసు అని రియా స్పష్టం చేశారు.

సుశాంత్‌కు దూరంగా రియా చక్రవర్తి

సుశాంత్‌కు దూరంగా రియా చక్రవర్తి

రియా తనను విడిచి వెళ్లిన తర్వాత సుశాంత్ ఒంటరిగా ఫీలయ్యాడని, ఆ తర్వాత ఆమె తీరుకు నొచ్చుకొన్నాడనే విషయాన్ని సిబ్బంది వెల్లడించినట్టు సమాచారం. ఓ దశలో రియా విషయంలో తీవ్ర మనస్తాపానికి చెందినట్టు తెలిసింది. సుశాంత్ తన మరణానికి ముందు రియాకు చివరి కాల్ చేశాడని, అయితే ఆ కాల్‌ను రిసీవ్ చేసుకొన్నారా అనే విషయంలో క్లారిటీ లభించడం లేదు.

రియాకు దూరంగా సుశాంత్ ఫ్యామిలీ

రియాకు దూరంగా సుశాంత్ ఫ్యామిలీ


ఇక సుశాంత్ మరణం తర్వాత అంత్యక్రియలకు హాజరైన సమయంలో రియాకు ఇంటి సభ్యులు దూరంగా ఉన్నట్టు సమాచారం. శ్మశాన వాటికలో ఎవరూ కూడా రియాతో మాట్లాడకపోవడం అనేక సందేహాలకు దారి తీసింది. మరణాంతరం తర్వాత కూడా రియాతో సుశాంత్ కుటుంబం దూరంగానే ఉన్నట్టు తెలుస్తున్నది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
రియాపైనే అనేక సందేహాలు

రియాపైనే అనేక సందేహాలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తర్వాత పలువురు సెలబ్రిటీలు రియాపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రియా విషయంలో ఏం జరిగిందనే విషయం ముంబై పోలీసులు చేపట్టిన విచారణ ద్వారానే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి చూపు రియా వైపే ఉంది. సుశాంత్ ఆత్మహత్య విషయంలో ఆమెను బలి పశువును చేస్తారా;? లేక ఏదైన బలమైన కారణం వెలుగులోకి వస్తుందా అనే విషయం విచారణ తర్వాతే తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X