సుశాంత్ మాజీ లవర్‌కు నిశ్చితార్థం.. ఆరేళ్లు డేటింగ్, చీటింగ్.. మృతి వెనుక వీడిన మిస్టరీ?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మిస్టరీగా మారింది. ఇప్పటి వరకు ఆయన మరణానికి కారణమేమిటో అంతుపట్టకుండా మారింది. సుశాంత్ మరణానికి కారణం ఏమిటనే విషయాలపై ముంబై పోలీసులు దృష్టిపెట్టారు. అయితే తాజాగా తన మాజీ ప్రేయసికి ఎంగేజ్‌మెంట్ జరగడం సుశాంత్ సింగ్‌కు మనస్తాపం కలిగించిన కారణంగానే సూసైడ్ చేసుకొన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే..

జీవితంలో తోడుంటా..
తల్లి మరణంతో ఒంటరితనంతో బాధపడే సుశాంత్ మనసుకు టెలివిజన్ నటి అంకితా లోఖండే చేరువయ్యారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు చోటుచేసుకొన్నాయి. ఓ దశలో 2016లో అంకితా ట్వీట్ చేస్తూ.. నీవు ఒంటరివని ఎప్పుడూ బాధపడకు. నీ హృదయంలో, జీవితంలో నేను ఎప్పుడూ ఉంటాను అని ట్వీట్ చేసింది.

ఆరేళ్ల ప్రేమాయణానికి గుడ్‌బై
సుశాంత్, అంకితా మధ్య ప్రేమయాణం జోరుగా సాగిపోయింది. వారిద్దరు ఒక్కటవ్వడం ఖాయమనే అనుకొనే సమయంలో అఫైర్‌కు బ్రేకప్ చెప్పారు. అలా సుశాంత్, అంకితా ఆరేళ్ల ప్రేమాయణం అర్ధాంతరంగా ముగిసింది. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు షాక్‌లోనే సుశాంత్ జీవితాన్ని వెళ్లదీశారు.

జూన్ 11న అంకితా లోఖండ్‌కు
తాజాగా అంకితా లోఖండ్‌కు నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వచ్చాయి. జూన్ 11వ తేదీన వికీ జైన్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు పలు జాతీయ పత్రికలు కథనాన్ని ప్రచురించాయి. అయితే తన వివాహా నిశ్చితార్థంపై అధికార ప్రకటన చేయకపోయినా వేలికి ఉంగరంతో కూడిన ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ తర్వాత మరుసటి రోజే సుశాంత్ సూసైడ్ చేసుకోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది.

మాజీ ప్రియుడి మరణంపై
అయితే సుశాంత్ మరణం వార్తతో అంకితా తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయారు. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. పవిత్ర రిస్తా సీరియల్ నటీనటులు, సాంకేతిక నిపుణులు సుశాంత్ మృతి వార్తతో షాక్ తిన్నారు. వారంతా ఆయనకు సోషల్ మీడియాలో శ్రద్దాంజలి ఘటించారు.
Recommended Video

రియాతో సుశాంత్ అఫైర్
కాగా, అకింతాతో బ్రేకప్ తర్వాత రియా చక్రవర్తితో సుశాంత్ అఫైర్ నడుస్తున్నది. రియాకు మేనేజర్‌గా, తనకు మేనేజర్‌గా వ్యవహరించిన దిశా సలియాన్ సూసైడ్ బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఈ విషాద వార్త నుంచి బయటపడకుండానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించడం మరింత దిగ్బ్రాంతికి గురిచేసింది.


Click it and Unblock the Notifications











