సుశాంత్‌పై చేతబడి ప్రయోగం!.. క్షుద్రపూజల కోసమేనా అంత భారీగా ఖర్చు?

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయనపై చేతబడి ప్రయోగం జరిగిందనే ఆరోపణలు కూడా మీడియాలో ప్రచారం అయ్యాయి. ఈ ఆరోపణలపై పలువురి కనుబొమ్మలు కూడా ఎగిరిపడ్డాయి. అయితే తాజాగా సుశాంత్‌ బ్యాంక్ అకౌంట్లలో అవకతవకల ఆరోపణల్లో భాగంగా పూజ ఖర్చు లక్షల్లో ఉండటంతో క్షద్రపూజల వాదనకు మరోసారి బలం చేకూరింది. బ్యాంక్ అకౌంట్ల తనిఖీలో బయటపడిన విషయం ఏమిటంటే..

రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫర్

రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ తన కుమారుడి బ్యాంక్ అకౌంట్‌ను భారీగా దుర్వినియోగం చేశారు. సుశాంత్ అకౌంట్‌ నుంచి రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అంతేకాకుండా పూజల పేరుతో రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసినట్టు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి అని కేకే తన ఫిర్యాదులో కేకే పేర్కొన్నారు.

పూజల కోసం భారీగా బదిలీ

పూజల కోసం భారీగా బదిలీ

సుశాంత్ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ట్రాన్సక్షన్ వివరాలను పరిశీలించగా.. కోల్గ్ ఫిరోజ్ ఆహ్మద్ షేక్ అనే వ్యాపారికి భారీగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు కనిపించింది. దాదాపు ఆయన అకౌంట్‌కు 5,27,777 రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. పూజ కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఏమున్నదనే విషయం ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నది.

 ఒక నెలలోనే భారీగా పూజలు

ఒక నెలలోనే భారీగా పూజలు

ఒక నెలలోనే పూజల కోసం భారీగా ఖర్చు చేయడం అనేక సందేహాలు రేకెత్తిస్తున్నది. 2019 జూలై 14వ తేదీన ముంబైలోని ఓ హోటల్‌లో రూ.62179 ఖర్చు చేశారు. అదే రోజు 45 వేల రూపాయలను పూజ సామాగ్రి కోసం వినియోగించారు. ఆ తర్వాత జూలై 22న 55 వేలు, 36 వేల రూపాయలను ఖర్చు చేశారు. అదే విధంగా ఆగస్టు 2, 2019న 86 వేల రూపాయలను పూజ సామాగ్రి కోసం ఖర్చు చేయడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నది.

 గతేడాది జూలై, ఆగస్టు మాసంలోనే

గతేడాది జూలై, ఆగస్టు మాసంలోనే

ఇక సుశాంత్ అకౌంట్ నుంచి పూజ కోసం ఖర్చు అంతటితో ఆగలేదు. జూలై తర్వాత ఆగస్టులో కూడా పూజల కోసం భారీగా ఖర్చు చేశారు. ఆగస్టు 8వ తేదీన 11 వేలు, 2019 ఆగస్టు 9వ తేదీన శృతి మోడీ అనే అకౌంట్‌కు 63 వేల రూపాయలు, అనంతరం ఆగస్గు 15 2009న 60 వేల రూపాయలు పూజ కోసం డబ్బును మళ్లీ కోల్గ్ ఫిరోజ్ ఆహ్మద్ షేక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
గత ఇంటిలో ప్రేతాత్మలు అంటూ

గత ఇంటిలో ప్రేతాత్మలు అంటూ

అయితే సుశాంత్ సింగ్‌పై చేతబడి జరిగిందా అనే విషయంపై ఆరోపణలే తప్ప ఎక్కడా ఆధారాలు లేవు. అయితే తన పాత ఇంటిలో ప్రేతాత్మలు తిరుగుతున్నాయనే భయంతో ఇల్లు మారాడని, ఆ ఇంటి నుంచి రియా చక్రవర్తి ఇంటిలో కొన్నాళ్లు ఉన్నారని స్నేహితులు, వంట మనిషి చెప్పారు. అనంతరం ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోకి మారారు అని సన్నిహితులు పేర్కొన్నారు. అయితే ఈ రేంజ్‌లో పూజలకు సొమ్ము ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలు అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X