సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో బ్రిటన్ వ్యాపారవేత్త అరెస్ట్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో మరోసారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పంజా విసిరింది. డ్రగ్స్ కేసులో బ్రిటన్ పౌరుడు, వ్యాపారవేత్త కరణ్ సంజానీ, సెలబ్రిటీ మేనేజర్ రహిలా ఫర్నీచర్‌వాలాను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

మీడియా రిపోర్టు ప్రకారం.. గత నెల రహిలా, కరణ్ 200 కేజీల డ్రగ్స్‌తో పట్టుబడటంతో వారిని జుడిషియల్ కస్టడీకి తరలించారు. విచారణ నిమిత్తం ఫిబ్రవరి 4వ తేదీ ఎన్సీబీ కార్యాలయానికి పిలిచి అరెస్ట్ చేశారు.

 Sushant Singh Rajput Death Case: Britain Citizen Karan Sajnani arrested

సుశాంత్ సింగ్ డెత్ కేసుతో సంబంధమున్న డ్రగ్స్ వ్యవహారంలో రహిలా ఫర్నీచర్ వాలా, కరణ్ సంజానీని అరెస్ట్ చేశాం అని ఎన్సీబీ ప్రకటనను విడుదల చేసింది. సుశాంత్ మరణం కేసులో జగదీప్ సింగ్ ఆనంద్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని ప్రకటనలో పేర్కొన్నది. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కరమ్ జీత్‌కు జగదీప్ సింగ్ సోదరుడు కావడం గమనార్హం.

రహిలా ఫర్నీచర్ వాలా, కరణ్ సంజానీతోపాటు జగదీప్ సింగ్ ఆనంద్‌ను త్వరలోనే విచారిస్తాం. వారిని రిమాండ్‌లోకి తీసుకొని ప్రశ్నిస్తాం అని ఎన్సీబీ పేర్కొన్నది. ఇదిలా ఉండగా, రహిలా ఫర్నీచర్ వాలా, కరణ్ సంజానీ శుక్రవారం బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X