twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ డెత్ కేసులో రియాకు మరో షాక్: సీబీఐ దర్యాప్తుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

    |

    దేశవ్యాప్తంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు సంచలనంగా మారుతోంది. గత కొన్ని వారాలుగా కేసుని సీబీఐకి అప్లగించాలని సాధారణ జనాల నుంచి ప్రముఖ సెలబ్రెటీస్ వరకు అందరూ సోషల్ మీడియా ద్వారా వారి భావాన్ని తెలియజేశారు. ఇక ఎట్టకేలకు సీబీఐ విచారణకు ఆమోదం లభించింది. సీబీఐ విచారణ కోసం బీహార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా వెంటనే గ్రీన్ సిగ్నల్ లభించింది.

    Recommended Video

    Sushant Singh Rajput's Case Transferred To CBI : Centre Accepts Bihar Govt’s Request || Oneindia
    సీబీఐ చేతుల్లోకి సుశాంత్ కేసు

    సీబీఐ చేతుల్లోకి సుశాంత్ కేసు

    ముంబై నగర పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సుశాంత్ సింగ్ బీహార్ లో కేసు నమోదు చేయగా వారు కూడా సుశాంత్ కేసుపై తీవ్ర స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో బీహార్ పోలీసులు ముంబై పోలీసులకు సహకరించడం లేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక మొత్తానికి కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లబోతోంది.

    ముంబై పోలిసులకు కోర్టు ఆదేశాలు

    ముంబై పోలిసులకు కోర్టు ఆదేశాలు

    అయితే ఒకే కేసును ఇరు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తుపై అసహనం వ్యక్తం చేసిన రియా చక్రవర్తి కేసును ముంబై పోలీలులే విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక కేసులో సాక్ష్యాలు తారుమరయ్యాయని సుశాంత్ తండ్రి తరపు లాయర్ కోర్టులో వాదించగా.. ఈ విషయంపై స్పందించిన కోర్టు మూడు రోజుల్లో ముంబై పోలీసులు ఇన్ని రోజులు చేసిన దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్స్ ని సమర్పించాలని ఆదేశించింది.

    నిజానిజాలు వీలైనంత త్వరగా తెలియాలి..

    నిజానిజాలు వీలైనంత త్వరగా తెలియాలి..

    ప్రతిభావంతుడైన సుశాంత్ లాంటి హై ప్రొఫైల్ వ్యక్తి అనుమానాస్పధంగా మరణించారు అంటూ.. ఈ కేసులో నిజానిజాలు వీలైనంత త్వరగా తెలియాలని కోర్టు పోలిసులకు తెలిపింది. ఇక బీహార్ పోలీస్ అధికారిని క్వారంటైన్ చేయడం కూడా మంచి సంకేతం కాదని కూడా న్యాయం స్థానం హెచ్చరించింది.

    మరో మూడు రోజుల్లో..

    మరో మూడు రోజుల్లో..

    కోర్టు చెప్పిన దాన్ని బట్టి చూస్తే..మరో మూడు రోజుల్లో సుశాంత్ డెత్ కేసులో మరో మలుపు తిరగబోతున్నట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ చనిపోవడానికి ప్రధానం కారణం రియా చక్రవర్తి అంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు విషయంలో భవిష్యత్తులో రియా మరిన్ని విచారణలలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Sushant Singh Rajput's girl friend Rhea Chakraborty opposes Bihar government's CBI investigation recommendation. Earlier she tweeted that I’m sushants Singh Rajputs girlfriend Rhea chakraborty,it is now over a month since his sudden demise I have complete faith in the government, however in the interest of justice..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X