సుశాంత్ సింగ్ కేసులో ఊహించని మలుపు.. ఆ రూట్లో గుట్టు లాగేందుకు సీబీఐ ప్లాన్

బాలీవుడ్ యంగ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి ఇప్పటికి నాలుగేళ్ళు అవుతోంది. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని అందరూ నమ్ముతున్నారు. అయితే అతని ఆత్మహత్యకి బలమైన కారణాలు అయితే తెలియరావడం లేదు. సుశాంత్ తల్లిదండ్రులు అయితే తమ కొడుకుని సాధారణ మరణం కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని చెబుతున్నారు.

ఇక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర సర్కార్ పబ్లిక్ ఒత్తిడితో ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. అప్పటి నుంచి సుశాంత్ మరణం వెనుక అసలు కారణాలు వెతికే పనిలో సీబీఐ పనిచేస్తోంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి రీజన్స్ ని గుర్తించలేదు. అయితే ఈ కేసు విచారణని మరల ఇప్పుడు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

 Sushant Singh Rajput Death Case CBI Poised to Recover Deleted Chats

అందులో భాగంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫోన్ చాటింగ్ ని బయటకి తీసే ప్రయత్నం మొదలు పెట్టారు. అతని మొబైల్ లో డిలేట్ చాటింగ్ మొత్తం బ్యాక్ అప్ చేయడానికి గూగుల్ అలాగే ఫేస్ బుక్ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. వారి నుంచి కూడా సహకారం లభించే ఛాన్స్ ఉందని టాక్. దేశ వ్యాప్తంగా సంచలనం అయిన కేసు కావడంతో ఈ చాటింగ్ లు బయటకొస్తే చాలా వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. ఆ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్ పై బయటకొచ్చి ఉంటుంది. ప్రస్తుతం ఆమె సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తోంది. అయితే పెద్దగా ఆమె ఆశ నెరవేరడం లేదు. మరో వైపు తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సుశాంత్ మరణంపై జరుగుతోన్న ఇన్వెస్టిగేషన్ పై మాట్లాడారు. సీబీఐ కొన్ని ఆధారాలు సేకరించింది అని, అయితే వాటిలో ప్రామాణికత ఎంత అనేది తెలుసుకునే పనిలో ఉన్నారని అన్నారు. సీబీఐ దానిపై పూర్తి విచారణ చేసి వాస్తవాలు బయటపెట్టనుంది అని క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X