twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ మరణం కేసులో తొలి అరెస్ట్.. రియా సోదరుడికి ఉచ్చు.. దిశా సలియాన్ బాస్‌కు సమన్లు!

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కొరడా ఝులిపిస్తున్నాయి. ఇటీవల రియా చక్రవర్తికి డ్రగ్స్ మాఫియాతో లింకులు బయటపడటంతో ఎన్సీబీ రంగంలోకి దూకి బాలీవుడ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీసున్నది. ఈ క్రమంలోనే ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది. మరో ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు సమాచారం. ఈ కేసు విచారణకు సంబంధించిన మరిన్నీ వివరాలు..

    Recommended Video

    Sushant Singh Rajput : సుశాంత్‌ మృతి కేసులో రెండు నెలల తరువాత ఇద్దర్ని అరెస్ట్ చేసిన NCB || Oneindia
    బాలీవుడ్, కన్నడ పరిశ్రమలో డగ్ర్స్ కలకలం

    బాలీవుడ్, కన్నడ పరిశ్రమలో డగ్ర్స్ కలకలం

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటం, ఆ మాఫియాతో సంబంధాలు పలు సినీ పరిశ్రమలకు ఉండటం సంచలనం రేపుతున్నది. కన్నడ పరిశ్రమలో కూడా ఓ నటి డగ్ర్స్ వ్యవహారంలో అరెస్ట్ కావడం కలకలం రేపింది. ఇలా అన్ని సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్‌ లింకులపై నజర్ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ పెట్టింది.

    దిశా సలియాన్‌ కంపెనీ సీఈవోకు సమన్లు

    దిశా సలియాన్‌ కంపెనీ సీఈవోకు సమన్లు

    ఇక బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా లింకులపై దర్యాప్తు చేస్తున్న అధికారులు టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కార్నర్ స్టోన్ సీఈవో బంటీ సజ్‌దేహ్‌కు సమన్లు జారీ చేశారు. దిశా సలియాన్ మరణానికి ముందు ఈ కంపెనీతో పనిచేశారు. ఈ క్రమంలో సుశాంత్ మరణానికి, దిశా మరణానికి ఏదైనా లింకు ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

    ఇద్దరు డ్రగ్స్ సప్లయిర్ల అరెస్ట్

    ఇద్దరు డ్రగ్స్ సప్లయిర్ల అరెస్ట్

    అలాగే ముంబైలో మరో ముగ్గురిని ఎన్సీబీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నది. సుశాంత్ మరణం కేసుతో సంబంధమున్న డ్రగ్స్ డీలర్లు జేద్ విలత్రా, అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను అరెస్ట్ చేసింది. జేయిద్ విలత్రాను సెప్టెంబర్ 9వ తేదీ వరకు కస్టడీకి తరలించారు. అయితే 10 రోజుల కస్టడీని ఎన్సీబీ కోరినట్టు సమాచారం. త్వరలోనే ఇద్దరిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

    రియా చక్రవర్తి సోదరుడి లింకులపై ఆరా

    రియా చక్రవర్తి సోదరుడి లింకులపై ఆరా

    ఇదిలా ఉండగా, రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తికి డ్రగ్స్ సప్లయి చేసిన వ్యక్తి కోసం ఎన్సీబీ వెతుకుతున్నది. ఈ కేసులో అనుమానిత సప్లైదారుడి కీలకంగా మారే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. సుశాంత్ మరణానికి, డ్రగ్స్ లింకుల వ్యవహారంలో షోవిక్ చక్రవర్తి పేరు ప్రధానంగా వినిపిస్తన్న నేపథ్యంలో ఆయనకు ఉన్న సంబంధాలపై ఈడీ, సీబీఐ, ఎన్సీబీ ప్రధానంగా దృష్టిపెట్టింది.

    English summary
    NCB, ED, CBI are in high speed in Sushant Singh Rajput death case. On Wednesday, NCB arrested alleged drug dealers Zaid Vilatra and Abdul Basit Parihar arrested in connection to the Sushant Singh Rajput death case. Now, They sent to custody till September 9th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X