twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో కొత్త ట్విస్టు.. దావూద్ ఇబ్రహీం అనుచరుడి అరెస్ట్‌!

    |

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో గతేడాది కాలంగా కొనసాగుతున్న దర్యాప్తుకు తెరవేసేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పావులు కదుపుతున్నది. కొద్ది నెలల విరామం తర్వాత బాలీవుడ్‌తో బయటపడిన డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో మళ్లీ అరెస్టుల జోరును కొనసాగిస్తున్నది. తాజాగా ఎన్సీబీ చేస్తున్న దర్యాప్తు విషయంలోకి వెళితే...

    రియా చక్రవర్తిపై ఫిర్యాదుతో

    రియా చక్రవర్తిపై ఫిర్యాదుతో

    గతేడాది జూలై 31వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) సుశాంత్ మరణం కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. రియా చక్రవర్తికి వ్యతిరేకంగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని ఈడీ ఈ కేసులో దర్యాప్తును మొదలుపెట్టింది. ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూడటంతో ఎన్సీబీని ఈడీ రంగంలోకి దించింది.

     సిద్దార్థ్ పితాని వెల్లడిస్తున్న సమాచారంతో

    సిద్దార్థ్ పితాని వెల్లడిస్తున్న సమాచారంతో

    సుశాంత్ కేసులో కీలకంగా భావిస్తున్న హీరో స్నేహితుడు సిద్దార్థ్ పితానిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన తర్వాత స్థానిక ముంబై కోర్టులో ప్రవేశపెట్టింది. జూన్ 2వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకొని ఎన్సీబీ ప్రశ్నిస్తున్నది. ఈ క్రమంలో సిద్దార్థ్ పితానిని వెల్లడిస్తున్న సమాచారంతో ముంబైలోని పలు చోట్ల మెరుపు దాడులు చేస్తున్నది.

     ముంబైలో మెరుపు దాడులు

    ముంబైలో మెరుపు దాడులు

    గత రెండు రోజులుగా ముంబై, నగర పరిసర ప్రాంతంలోని లోఖండ్‌వాలా, బాంద్రా, అంధేరి లాంటి ఖరీదైన ప్రాంతాల్లో దాడులను ఉధృతం చేసింది. ఈ దాడుల్లో కీలక డ్రగ్స్ సరఫరాదారుడు హారీస్ ఖాన్‌ను అదుపులోకి తీసుకొన్నది. అంతేకాకుండా సుశాంత్ ఇంట్లో పనిమనుషులు కేశవ్, నీరజ్‌కు సమన్లు జారీ చేశారు. దాంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగేలా కనిపిస్తున్నది.

     దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌ సభ్యుడి అరెస్ట్

    దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌ సభ్యుడి అరెస్ట్

    హారీస్ ఖాన్ అరెస్ట్‌తో కొత్త ఊహగానాలు మొదలయ్యాయి. సుశాంత్ హత్య కేసులో మాఫియా హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీకి కొత్త లింకు లభ్యమైంది. ముంబైని గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహతుడు గ్యాంగ్‌స్టర్, డ్రగ్ మాఫియా సభ్యుడు పర్వేజ్ ఖాన్ అలియాస్‌కు చింకూ పఠాన్‌కు హరీస్ ఖాన్ క్లోజ్ కావడం ఈ కేసులో ఆసక్తి మరింత పెరిగింది.

    Recommended Video

    Sushant Singh Rajput: తప్పించుకు తిరుగుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ స్నేహితుడు రిషికేష్ పవార్...!!
     డ్రగ్ మాఫియాకు సంబంధం ఉందా?

    డ్రగ్ మాఫియాకు సంబంధం ఉందా?

    హారీస్ ఖాన్ అరెస్టుపై ఎన్సీబీ అధికారులు స్పందిస్తూ.. ఇప్పటి వరకు చింకూ పఠాన్‌తో సంబంధాల ఆధారంగానే అతడిని అరెస్ట్ చేశాం. ఈ ఇద్దరికి సుశాంత్ మరణం కేసుతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని మీడియాకు ఎన్సీబీ అధికారులు తెలిపారు.

    English summary
    NCB taking serious note on Sushant Singh Rajput death Case NCB official arrested Dawood Ibrahim's aide in drug peddling.NCB conducted rides in mumbai and arrested Haris Khan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X