Sushant Singh Death Case: గ్యాంగ్‌స్టర్ ఇంటిలో విషసర్పాలు, మారణాయుధాలు.. ఎన్సీబీకి ముచ్చెటమలు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల దృష్టికి సంచలన విషయాలు వస్తున్నాయి. సిద్దార్థ్ పితాని అరెస్ట్ తర్వాత ముంబైలోని పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహిం ముఠాకు చెందిన కీలక వ్యక్తిని ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద వస్తువులను చూసి అధికారులకు ముచ్చెటమలు పట్టాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ముంబైలో దాడులు తీవ్రతరం
సుశాంత్ మరణం కేసుతో లింక్ ఉన్న డ్రగ్స్ మాఫియా వ్యవహారాలపై ఎన్సీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఈ కేసు విచారణలో లభ్యమవుతున్న సమాచారం ఆధారంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల బంద్రా, జుహు, లోఖండ్ వాలాలో నిర్వహించిన దాడుల్లో హారీస్ ఖాన్ అనే డ్రగ్ సప్లయర్‌ను అరెస్ట్ చేశారు.

దావుద్ ఇబ్రహీం ముఠాలో కీలక సభ్యుడు
ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహిం మాఫియా గ్యాంగులో హరిస్ ఖాన్ కీలక సభ్యుడు. అంతేకాకుండా గ్యాంగ్‌స్టర్ చింకు పఠాన్‌కు హారీస్ ఖాన్ అత్యంత సన్నిహితుడు. సుశాంత్ కేసులో డ్రగ్స్ మాఫియా లింకులపై దృష్టి పెట్టిన ఎన్సీబీ అధికారులు హారీస్ ఖాన్ వలపన్ని పట్టుకొన్నారు.

విషసర్పాలు, మారణాయుధాలు
హారీస్ ఖాన్ ఇంటిపై దాడులు చేయగా.. అతడి ఇంటిలో భయంకరమైన విష సర్పాలు, మరణాయుధాలు బయటపడ్డాయి. దాంతో ఎన్సీబీ అధికారులకు ముచ్చెటమటలు పట్టాయి. హారీస్ ఇంటి నుంచి విషసర్పాలు, ఆయుధాలతోపాటు పెద్ద ఎత్తున్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు. హారీస్ ఖాన్ పెంచి పోషిస్తున్న విషసర్పాలు గురించి విచారణలో ఆరా తీసినట్టు తెలుస్తున్నది.
Recommended Video

హారిస్ ఖాన్‌పై కేసు.. సెక్షన్లు ఇవే..
ప్రస్తుతం అరెస్ట్ అయిన హారీస్ ఖాన్‌ను ప్రశ్నిస్తూ సమాచారం సేకరిస్తున్నారు. అతడిపై ఆర్మ్ యాక్ట్ 1959 కింద సెక్షన్ 188 (ప్రభుత్వ అధికారుల ఆదేశాలను ఉల్లంఘించడం, విధులను అడ్డుకోవడం), సెక్షన్ 269 (మనుషుల ప్రాణాలకు అపాయం కలిగించారని), సెక్షన్ 34 (దురుద్దేశ పూరితమైన కుట్ర), సెక్షన్ 4(అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం), సెక్షన్ 25తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Click it and Unblock the Notifications











