సుశాంత్ బెడ్‌రూమ్ వీడియో వైరల్.. లీకైతే మన దర్యాప్తుకు ముప్పు.. పోలీసుల గుసగుసలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఆది నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలీవుడ్‌లో ఓ వర్గం ఆయన మరణం కారణం డిప్రెషన్‌కు గురై సూసైడ్ చేసుకొన్నారనే విధంగా ప్రచారం చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయితే వీడియో ముంబై పోలీసుల దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

Recommended Video

#SushantSinghRajput : Sushant గదిలో పోలీసులు మాట్లాడిన మాటలు వైరల్.. ఈ విషయం లీక్ కాకూడదు అంటూ..!!
సుశాంత్ పార్దీవ దేహం పక్కన పోలీసుల గుసగుసలు

సుశాంత్ పార్దీవ దేహం పక్కన పోలీసుల గుసగుసలు

సుశాంత్ సింగ్ మరణించారంటూ జూన్ 12వ తేదీన వార్త బయటకు పొక్కగానే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ వారు గుసగుసలాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోను ప్రముఖ టెలివిజన్ రిపబ్లిక్ టీవీ ఇటీవల ప్రసారం చేసి దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ వీడియోలో పోలీసులు మాట్లాడిన మాటలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయం లీక్ కాకూడదు అంటూ పోలీసుల సంభాషణ

ఈ విషయం లీక్ కాకూడదు అంటూ పోలీసుల సంభాషణ

సుశాంత్ మృతదేహం బెడ్‌పై ఉంది. ఇంటి పైకప్పు నుంచి సుశాంత్ మెడకు తగిలించుకొన్న చున్నీ బట్ట వేలాడుతున్నది. అలాంటి పరిస్థితుల్లో సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు మాట్లాడుకొంటూ.. ఈ విషయం లీక్ కాకూడదు. ఒకవేళ బయటకు వస్తే మన దర్యాప్తు అస్తవ్యస్తం అవుతుంది అంటూ గుసగుసలాడారు. పోలీసులు అలా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏమిటని మీడియా ప్రశ్నిస్తున్నది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా

సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా

సుశాంత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేసుకు సంబంధం లేని వ్యక్తులను ముంబై పోలీసులు విచారిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీడియో అనేక అనుమానాలకు బలం చేకూర్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సంచలనం రేపింది. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలనే డిమాండ్‌కు భారీగా మద్దతు లభిస్తున్నది.

నిజమేనా? టాంపర్ వీడియోనా?

నిజమేనా? టాంపర్ వీడియోనా?


గత కొద్దికాలంగా పోలీసుల గుసగుసల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తాజాగా రిపబ్లిక్ టెలివిజన్ తన డిబేట్ సందర్బంగా లీకైన వీడియో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు పోలీసు సంభాషణ వీడియో మరింత వైరల్ అవుతున్నది. అయితే ఆ వీడియోలో మాట్లాడిన మాటలు నిజమేనా? టాంపర్ చేశారా అనే మరో వాదన కూడా వినిపిస్తున్నది.

నటుడు, నేత చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ

నటుడు, నేత చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ


ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఎల్పీ నేత, రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు, నటుడు చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ.. ముంబై పోలీసు వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. సుశాంత్ మరణం వెనుక వాస్తవాలు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మన మధ్య సుశాంత్ లేరు. అందుకు కారణమేమిటనే విషయాలను, వాస్తవాలను వెల్లడించాలని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X