సుశాంత్ మరణంతో మనస్తాపం.. మిథున్ బర్త్ డే వేడుకలకు దూరం
డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్ లాంటి చిత్రాలతో 80, 90 దశకాల్లో యువతను ఉర్రూతలూగించిన మిథున్ చక్రవర్తి జన్మదినం జూన్ 16. కరోనా పరిస్థితులు, తండ్రి మరణం, యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం లాంటి విషాద సంఘటనలతో మనస్తాపం చెందిన మిథున్ తన 68వ జన్మదిన వేడుకలను వాయిదా వేసుకొన్నారు. లాక్‌డౌన్ సమయంలో కొందరు సెలబ్రిటీలు జన్మదిన సంబరాలు జరుపుకొన్నప్పటికీ.. మిథున్ మాత్ర బర్త్ డే సెలబ్రేషన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు.
మిథున్ కుమారుడు, యువ హీరో నమాషి చక్రవర్తి ఈ విషయం గురించి వెల్లడిస్తూ.. కరోనా, సుశాంత్ మరణం లాంటి సంఘటనల కారణంగా తన తండ్రి జన్మదిన వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించుకొన్నారు. ప్రజలు, అభిమానులంతా ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని కోరుకొన్నారు అని చెప్పారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్‌లో ప్రకంపనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో నమాషి చక్రవర్తి తన స్పందనను తెలియజేస్తూ.. ఎవరైనా ఎలాంటి విషయంలో అన్యాయం జరుగుతుందని భావించి మనస్తాపానికి గురైతే.. వెంటనే స్నేహితులు, కుటుంబానికి చెప్పుకొని బాధల నుంచి విముక్తి కావాలి. అంతేగానీ తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇగోలకు వెళ్లవద్దు. తన మనసును నచ్చచెప్పుకోవాలి. లేకపోతే డిప్రెషన్ మిమ్మల్ని కబళించి వేస్తుంది అని అన్నారు. నమాషి విషయానికి వస్తే.. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో బ్యాడ్ బాయ్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
మృగయతో కెరీర్ ప్రారంభించిన మిథున్.. అమర్ దీప్, అఖరీ ఇన్సాఫ్, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్ చిత్రాల్లో నటించారు. అలాగే తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన గోపాల గోపాలా అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.


Click it and Unblock the Notifications











