twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ మ‌ృతికి కొద్ది గంటల ముందు రియా చక్రవర్తి అక్కడే.. 302 సెక్షన్ విధింపుకు సీబీఐ రెడీ

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గతంలో ఎన్నో రోజుల నుంచి సుశాంత్ మరణానికి ముందు ఇంట్లో పార్టీ జరిగిందనే విషయంపై ఆధారం బయటపడిందనే విషయాన్ని జాతీయ టెలివిజన్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. ఆ వివరాల్లోకి వెళితే..

    సుశాంత్ మరణానికి కొద్ది గంటల ముందు

    సుశాంత్ మరణానికి కొద్ది గంటల ముందు

    లాక్‌డౌన్‌లో సుశాంత్ ఇంటిలోనే రియా చక్రవర్తి సహజీవనం చేశారనే విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. అయితే సుశాంత్ మరణానికి ముుందు రియా జూన్ 8వ తేదీన తాను ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయాను అనే విషయాన్ని రియా చక్రవర్తి వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే జూన్ 13 తేదీ రాత్రి లేదా జూన్ 14వ తేదీ తెల్లవారుజామున రియాను సుశాంత్ డ్రాప్ చేశారనే విషయాన్ని ప్రత్యక్ష సాక్షి వెల్లడించడంతో ఈ కేసులో కొత్త ట్విస్టు తెరపైకి వచ్చింది.

    అర్ధరాత్రి ఇద్దరూ కలిసే ఉండి

    అర్ధరాత్రి ఇద్దరూ కలిసే ఉండి

    ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన ప్రకారం.. జూన్ 13వ తేదీ అర్ధరాత్రి సుశాంత్, రియా చక్రవర్తి ఇద్దరూ కలిసి ఉండటాన్ని నేను చూశాను. రాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో రియా చక్రవర్తిని తన ఇంటిలో సుశాంత్ డ్రాప్ చేయడాన్ని స్వయంగా నేను చూశాను అని చెప్పడంతో ఈ కేసులో మరో అనుమానం తెరపైకి వచ్చింది.

    302 సెక్షన్ విధింపుపై సీబీఐ

    302 సెక్షన్ విధింపుపై సీబీఐ

    ఇక సుశాంత్ కేసులో ఎయిమ్స్ వైద్యుల రిపోర్టులు స్వీకరించిన తర్వాత సీబీఐ అధికారులు దర్యాప్తును మరింత వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఐపీసీ ప్రకారం 302 సెక్షన్‌ను విధించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు అదనంగా ఈ సెక్షన్‌ను చేరుస్తారనే ప్రచారం జరుగుతున్నది.

    Recommended Video

    Sushant Singh Rajput ఫ్యాన్స్‌ పై Salman Khan ప్రేమ, Sushant ఇష్యూ ఇక్కడితో ఆగిపోయినట్టేనా ?
     సిద్దార్థ్ పితానికి మరోసారి సమన్లు

    సిద్దార్థ్ పితానికి మరోసారి సమన్లు

    ఇదిలా ఉండగా, సుశాంత్ కేసులో భాగంగా సిద్దార్థ్ పితానిని మంగళవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ సమన్లు జారీ చేసినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. సుశాంత్ మరణించిన రోజు ఆయన ఇంటిలో సిద్ధార్థ్ పితాని ఉండటంతో కీలక సాక్షిగా మారారు. ఇప్పటికే పలుమార్లు విచారించిన అధికారులు మరోసారి విచారించేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశమైంది.

    English summary
    Lawyer Vikas Singh claimed Sushant Singh Rajput was strangulation and not suicide. He tweeted that Getting frustrated by the delay in CBI taking a decision to convert abetment to suicide to Murder of SSR. The Doctor who is part of AIIMS team had told me long back that the photos sent by me indicated 200% that it’s death by strangulation and not suicide. reports suggest that, Sushant and Rhea were met few hours before actor death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X