సుశాంత్ సింగ్ మరణించిన ముందురోజు పార్టీ.. మరో ట్విస్ట్ ఇచ్చిన హౌజ్ హెల్పర్
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి నెల దాటుతున్నా కూడా ఇంకా ఆ కేసులో సరైన క్లారిటీ రాలేదు. కానీ ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుండడంతో అందరిలో అనేక రకాల అనుమానాలు కలుగుతున్నాయి. మొన్నటివరకు ముంబై పోలీసులు విచారణలో ఒక రకమైన ఆధారాలు కనుగొంటే.. మరోవైపు సుశాంత్ తండ్రి ద్వారా కేసు నమోదు చేసుకున్న బీహార్ పోలీసులు మరో రకమైన అంశాలను కనుగొంటున్నారు. ఇక రీసెంట్ గా సుశాంత్ ఇంట్లో పని చేసే వ్యక్తి ఎవరికి తెలియని ఇక కొత్త విషయాన్ని చెప్పాడు.
Recommended Video

చనిపోవడానికి ముందురోజు?
సుశాంత్ సింగ్ చనిపోవాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అనే విషయంలో అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. కొన్నిరోజుల ముందు నుంచే అతని సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే సుశాంత్ చనిపోవడానికి ముందు ఏం జరిగింది అనే విషయాలపై ఇప్పటికే ముంబై పోలీసులు అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు.

ఇంట్లో పార్టీ జరగలేదు
అయితే సుశాంత్ చనిపోయిన ముందు రోజు అంటే జూన్ 13న తన ఇంట్లోనే పార్టీలో పాల్గొన్నారు అని అనే కామెంట్స్ వచ్చాయి. ముంబై పోలీసులు ఆ విషయంపై కాస్త నమ్మకం వ్యక్తి చేసి ఆ రోజు సీసీటీవీ పనిచేయలేదని అన్నారు. ఆ విషయంలో క్లారిటీ కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో బీహార్ పోలీసులు సుశాంత్ ఇంట్లో పని చేస్తున్న వ్యక్తిని రెండు గంటల పాటు విచారించగా అతను ఎవరు ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చాడు.

ట్విస్ట్ ఇచ్చిన హౌజ్ హెల్పర్
అసలు సుశాంత్ 14వా తేదీన ఉదయమే లేచాడని అంతకు ముందు రోజు బాంద్రాలోని తన ఇంట్లో ఎలాంటి పార్టీలు జరగలేదని డిన్నర్ చేసిన వెంటనే సుశాంత్ నిద్రపోయాడని చెబుతూ హౌస్ హెల్పర్ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ముంబై పోలీసులేమో సీసీటీవీ పని చేయలేదని చెప్పి చనిపోయిన ముందు రోజు హ్యాపీగా పార్టీ చేసుకున్నట్లు చెప్పడంపై అనేక రకాల అనుమానాలు వస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

రియా చక్రవర్తిపై స్పెషల్ ఫోకస్
ఇక సుశాంత్ సింగ్ ప్రేయసి రియా చక్రవర్తి ప్రస్తుతం అనేక రకాల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఓ వైపు ఇండస్ట్రీ నుంచి విమర్శలు వస్తుండగా మరోవైపు బీహార్ పోలీసులు, ముంబై పోలీసులు ఆమెపై స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. అయితే బీహార్ పోలీసులు ఈ కేసులో ఇన్వాల్వ్ కాకుండా కేవలం ముంబై పోలీసులే కేసును విచారణ జరపాలని రియా సుప్రీంకోర్టుకు వెళ్లడం అందరిని షాక్ కి గురి చేస్తోంది.


Click it and Unblock the Notifications











