అభిమాని కోరిక తీర్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. వరద బాధితులకు రూ.1 కోటి ఎలా ఇచ్చాడో తెలుసా!
కేరళ వరద బాధితుల కోసం సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఆ జాబితాలోకి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా చేశారు. కానీ సుశాంత్ చాలా వెరైటీగా సాయం చేశాడు. అదెలాగంటే. కొన్ని రోజులక్రితం సుశాంత్ సింగ్ అభిమాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నాకు కేరళ వరద బాదితులకు సాయం చేయాలనీ ఉంది. కానీ నా వద్ద డబ్బు లేదు. వారికీ ఎలా సాయపడాలో చెప్పు సుశాంత్ అంటూ ఆ అభిమాని అడిగాడు.
దీనికి సుశాంత్ బదులిస్తూ.. నీ వద్ద డబ్బులు లేవు కదా.. నేను కోటి రూపాయలు నీ పేరు మీద కేరళ వరద బాధితులకు ఇస్తాను. అది నేరుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు చేరేలా చూస్తాను. నా చేత ఈ పని చేయిస్తున్నందుకు నీకు థాంక్స్ అంటూ సుశాంత్ స్పందించాడు. మాట ఇచ్చినట్లుగానే రూ కోటి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు బదిలీ చేశాడు.

సుశాంత్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తీవ్రమైన వరదలతో కేరళలో జనజీవనం స్తంభించింది. దేశం నలువైపుల నుంచి భారీగా విరాళాలు కేరళకు చేరుతున్నాయి.


Click it and Unblock the Notifications











