twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Boycott Brahmastra: ఈ సినిమా వల్లే సుశాంత్ చనిపోయడంటూ.. దారుణంగా..

    |

    ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై బాయ్‌కాట్ నెగటివ్ ట్యాగ్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. గతంలో కాంట్రవర్సీ కామెంట్ చేసిన వారు అలాగే నెపోటీజమ్ అంటూ హడావిడి చేసేవారు ఇక మతాలపై తప్పుగా అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిపై నెటిజన్లు ఏమాత్రం పట్టు విడవకుండా ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. సినిమాకు తీవ్రస్థాయిలో నెగిటివ్ ప్రచారం కూడా ఒక రేంజ్ లో డ్యామేజ్ జరుగుతోంది.

    ఇక నిన్నటి వరకు లాల్ సింగ్ చడ్డా సినిమాపై ఒక రేంజ్ లో బాయ్‌కాట్ ట్యాగ్స్ ట్రెండ్ అవ్వగా బ్రహ్మాస్త్ర సినిమాను కూడా బాయ్ కట్ చేయాలి అంట ఓవర్గం వారు నెగటివ్ ట్యాగ్స్ తో హడావిడి చేస్తున్నారు. ఎందుకంటే సుశాంత్ ఆ సినిమా కారణంగానే చనిపోయాడు అంటూ ప్రచారాలు కూడా చేస్తున్నారు.. పూర్తి వివరాలలోకి వెళితే..

    నెగిటివ్ ట్యాగ్స్

    నెగిటివ్ ట్యాగ్స్

    రీసెంట్ గా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా అమీర్ ఖాన్ గతంలో మాట్లాడిన విషయాలపై తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఒక వివరణ కూడా ఇచ్చాడు. అయినప్పటికీ కూడా అమీర్ ఖాన్ గతంలో దేశంలో రక్షణ లేదు అని దేశంలో ఉండాలని లేదు అని చెప్పడం కించపరచినట్లే అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో లాల్ సింగ్ సినిమాను బాయ్‌కాట్ చేయాలి అని నెగటివ్ ట్యాగ్స్ ట్రెండ్ చేశారు.

    రెండు వారాలపాటు ట్రెండ్

    రెండు వారాలపాటు ట్రెండ్

    అంతేకాకుండా పీకే సినిమాలో చాలావరకు హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా చాలా సన్నివేశాలు ఉన్నాయి అని బాలీవుడ్ పరిశ్రమలో హీరోలు ఈ విధంగా అలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని నెటిజన్లు లాల్ సింగ్ చడ్డా సినిమాను హిందువులు ఎవరూ కూడా చూడవద్దు అని కూడా బాయ్‌కాట్ ట్యాగ్ ను దాదాపు రెండు వారాలపాటు ట్రెండ్ అయ్యేలా చేశారు.

    బ్రహ్మాస్త్ర సినిమాపై

    బ్రహ్మాస్త్ర సినిమాపై

    అయితే ఇప్పుడు మరొక పెద్ద సినిమాకు బాయ్‌కాట్ నెగిటివ్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో మప్పుగా మారబోతున్నట్లు అర్థమవుతుంది. లాల్ సింగ్ చడ్డా సినిమా ఊహించని విధంగా దారుణమైన కలెక్షన్స్ అందుకుంది. ఒక విధంగా బాయ్‌కాట్ నెగిటివ్ ట్యాగ్స్ తీవ్ర ప్రభావం చూపించింది. ఇక ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమాపై కూడా అదే తరహా నెగటివ్ ట్యాగ్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

    సుశాంత్ ఫ్యాన్స్

    సుశాంత్ ఫ్యాన్స్

    ముఖ్యంగా సుశాంత్ సింగ్ ను ఎక్కువగా ఇష్టపడే నేటిజన్స్ ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కంటెంట్ పై కాకుండా తెర వెనుక జరిగిన కొన్ని కారణాల వలన ఊహించని విధంగా నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

    సుశాంత్ మరణానికి కారణం అంటూ..

    సుశాంత్ మరణానికి కారణం అంటూ..

    ఎందుకంటే సుశాంత్ సింగ్ ను ఈ సినిమాలో మొదట హీరోగా సెలెక్ట్ చేశారు అని అయితే ఆ తర్వాత కరణ్ జోహార్ కావాలని నెపోటిజం ఆలోచనలతోనే సుశాంత్ సింగ్ ను తీసేశాడు అనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇక ఆ కారణం చేతనే పెద్ద సినిమా మిస్ అయింది అని సుశాంత్ సింగ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు అని ఆ తర్వాత నల్అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని కూడా చెబుతున్నారు. అందువల్లనే ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలి అని సుశాంత్ సింగ్ అభిమానులు కొన్ని నెగటివ్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ ప్రభావం సినిమాపై ఎంతవరకు పడుతుందో చూడాలి. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సెప్టెంబర్ 9న విడుదల కానుంది.

    English summary
    Sushant Singh Rajput fans fire with Boycott Brahmastra tags
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X