twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సూసైడ్‌పై సీబీఐ ఎంక్వైరీ.. సల్మాన్‌కు వ్యతిరేకంగా ముంబై, పాట్నాలో ధర్నాలు, దిష్టిబొమ్మ దగ్ధం

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్ ప్రముఖులపై నెటిజన్లు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, భన్సాలీ, ఏక్తా కపూర్, ఆలియాభట్ ఫ్యామిలీలపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బ్యాన్ చేయాలంటూ ప్రముఖులపై ట్రోలింగ్ చేయడం ట్రెండింగ్‌గా మారింది. ఇలాంటి నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు సల్మాన్ ఖాన్ ఇంటికి సమీపంలో ధర్నా చేశారు. ఆ ధర్నాకు సంబంధించిన వివరాలు..

    బీయింగ్ హ్యూమన్ స్టోర్ ఎదుట ధర్నా

    బీయింగ్ హ్యూమన్ స్టోర్ ఎదుట ధర్నా

    సుశాంత్ మరణం తర్వాత ప్రముఖులపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా బాంద్రాలోని బీయింగ్ హ్యూమన్ స్టోర్ వద్ద కొందరు ఆందోళన నిర్వహించారు. సల్మాన్ ఖాన్ నశించాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్టోర్‌పై ఉన్న సల్మాన్ ఖాన్ ఫోటోను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

    సూసైడ్ కాదు.. హత్య

    సూసైడ్ కాదు.. హత్య

    ఇక పాట్నాలో కూడా సుశాంత్ సింగ్ అభిమానులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. సుశాంత్ మరణం సూసైడ్ కాదు.. ప్రేరేపించిన హత్య అని ఆరోపించారు. పాట్నాలో సుశాంత్ అభిమానులు నిర్వహించిన ధర్నా గందరగోళంగా మారింది. ఈ ధర్నాను బీజేపీకి చెందిన యువ మోర్చా నాయకుడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరణ్, సల్మాన్ తదితరులను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి. ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించి దర్యాప్తు చేయించాలి అని డిమాండ్ చేశారు.

    బీహార్‌లో ధర్నా, సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్

    బీహార్‌లో ధర్నా, సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్

    బీహార్‌లో సల్మాన్ ఖాన్ స్టోర్ వద్ద నిర్వహించిన ధర్నా సందర్భంగా సల్మాన్, ఇతర సినీ ప్రముఖుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. బాలీవుడ్ ప్రముఖుల అరాచకాలను, దుర్మార్గాలపై నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఇలాంటి ధర్నాలు నిర్వహించడం ఉపయోగం ఉండదు. బీహార్ ప్రజలకు సుశాంత్‌పై ప్రేమ ఉంటే సల్మాన్ ఖాన్, ఇతర బాలీవుడ్ ఫ్యామిలీ సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకోవాలి అంటూ డిమాండ్ చేశారు.

    Recommended Video

    Sushant Singh Rajput: Karan Johar, Salman Khan ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి!!
    సోషల్ మీడియాలో ఉద్యమం

    సోషల్ మీడియాలో ఉద్యమం

    బాలీవుడ్ ప్రముఖుల తీరును ఎండగడుతూ సోషల్ మీడియాలో ఉద్యమం కొనసాగుతున్నది. Bollywood Blocked Sushant, Boycott Karan Johar Movie Gang, CBI enquiry on Sushant Suicide అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఈ కేసును ప్రస్తుతం ముంబై పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు.

    English summary
    Bollywood Sushant Singh Rajput committed suicide on June 14th. Sushant Singh Rajput Fans staged protest outside Salman’s ‘Being Human’ store in Bandra, Patna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X