రియా చక్రవర్తి లీలలు వెలుగులోకి.. సుశాంత్ ఖాతాలో రూ.15 కోట్లు మాయం.. సిమ్‌కార్డులు మార్చి దారుణంగా!
యువ హీరో, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తులో ఊహించని సంఘటనలు చకచకా చోటుచేసుకొంటున్నాయి. సుశాంత్ తండ్రి కేకే సింగ్ బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిపై కేసు నమోదు చేయడంతో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మరణానికి ముందు సుశాంత్‌తో రియా అనుసరించిన తీరు మరింత అనుమానాస్పదంగా మారింది. సుశాంత్ మరణానికి ముందు రియా చేసిన వ్యవహారాలు ఏమిటంటే..

సుశాంత్ తండ్రి ఆరు పేజీల ఫిర్యాదు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కేకే సింగ్ ఆరు పేజిల సుదీర్ఘమైన ఫిర్యాదును బీహార్ పోలీసులకు అందజేశారు. 2019 వరకు సుశాంత్‌కు ఎలాంటి మెంటల్ డిప్రెషన్ లేదు. ఒకవేళ ఆ తర్వాత డిప్రెషన్‌కు గురైతే కారణాలు ఏమిటి అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని కేకే సింగ్ తన ఫిర్యాదులో వెల్లడించినట్టు సమాచారం. దాంతో రియాపై పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

రియా భారీగా డబ్బు దుర్వినియోగం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆర్థిక విషయాల్లో చేతివాటం ప్రదర్శించిందని కేకే సింగ్ ఆరోపించారు. సుశాంత్ క్రెడిట్, డెబిట్ కార్టులను దుర్వినియోగం చేసి రియా చక్రవర్తి భారీ డబ్బును కొల్లగొట్టింది. ఆర్థికపరమైన సమస్యలు రావడం కూడా తన కుమారుడి డిప్రెషన్‌కు కారణమై ఉంటుంది. సుశాంత్‌కు సంబంధం లేని వ్యక్తుల అకౌంట్లకు భారీగా డబ్బు ట్రాన్స్‌ఫర్ అయింది అని ఫిర్యాదులో కేకే సింగ్ ఆరోపించినట్టు సమాచారం

సుశాంత్ సింగ్ అకౌంట్ నుంచి 15 కోట్లు మాయం
సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్ల రూపాయలు మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అంత మొత్తంలో డబ్బు ఎందుకు ట్రాన్స్‌ఫర్ అయిందనే విషయంపై కేకే సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే యూరప్ షూటింగ్‌కు వెళ్లినప్పుడు సుశాంత్ అకౌంట్ నుంచి డబ్బులు భారీగా వాడుకొన్నారు. పలుమార్లు విమాన టికెట్లు కూడా సుశాంత్ ఖాతా నుంచే వాడుకొన్నది అని కేకే సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సుశాంత్ మొబైల్ నంబర్లు మార్చిన రియా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు 50 సిమ్ కార్డులను మార్చిందనే ఆరోపణలను నటుడు శేఖర్ కుమార్ ఓ టెలివిజన్ డిబేట్‌లో వెల్లడించారు. అయితే రియా తరచుగా సుశాంత్ మొబైల్ నంబర్లను మార్చి కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకుండా చేసిందనే ఆరోపణ కూడా వినిపిస్తున్నది. కుటుంబానికి దూరమై రియా చేతిలో బందీ అవుతున్నానా అనే విషయం కూడా సుశాంత్ డిప్రెషన్‌కు దారి తీసి ఉంటుందా అనే విషయం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది.
Recommended Video

సుశాంత్, ఆయన సోదరితో గొడవలు
సుశాంత్ మరణానికి అతడితో పలుమార్లు గొడవలకు దిగిందనే విషయం మీడియాలో వెలుగు చూసింది. అంతేకాకుండా ముంబైలో ఉండే సుశాంత్ సోదరితో కూడా రియా పలుమార్లు గొడవ పెట్టుకొన్నదని, వారి మధ్య అనేక సార్లు వాగ్వాదం జరిగింది అనే విషయం కొత్తగా బయటకు వచ్చింది. ఇలాంటి విషయాల్లో వాస్తవాలు బయటకు రావాలంటే క్షుణ్ణంగా విచారణ చేపట్టాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి రావడంతో ముంబై పోలీసుల దర్యాప్తుపై ఒత్తిడి పెంచుతున్నదనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











