సుశాంత్ మృతిపై తొలిసారి నోరు విప్పిన తండ్రి.. మీడియాకు సంచలన విషయాలు వెల్లడి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సుశాంత్ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీడియాకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతుల్లో చివరి కార్యక్రమాలను పూర్తి చేశారు. అయితే చాలా రోజుల తర్వాత సుశాంత్ మరణం గురించి ఆయన తండ్రి కేకే సింగ్ బాలీవుడ్‌కు చెందిన మీడియాతో ఎక్స్‌క్యూజివ్‌గా మాట్లాడారు. సుశాంత్ గురించి తండ్రి ఏం చెప్పారంటే..

మొదట్లో అన్ని విషయాలు..
బాలీవుడ్‌లో రాణిస్తున్న సమయంలో తన జీవితంలో జరిగే ప్రతీ విషయాన్ని మాకు చెప్పుకొని సంతోషపడేవారు. కాని చివర్లో మాతో ఏ విషయాలును కూడా షేర్ చేసుకోవడం మానేశారు. కారణాలు ఏమిటో మాకు తెలియదు. కానీ ఆ విషాదం చోటుచేసుకోవడానికి కొన్ని రోజుల ముందు మాతో ఏదో ముభావంగా ఉండటం కనిపించింది. అయితే సమస్యలు ఏవైనా ఉంటే సర్దుకొంటాడని అనుకొన్నాం అని కేకే సింగ్ తెలిపారు.

ఎన్నో పూజలు చేస్తే పుట్టాడు
సుశాంత్ పుట్టుక మాకు వరం లాంటింది. ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తే మాకు వరంగా పుట్టాడు. మాకు అబ్బాయి కావాలని మూడేళ్లు నిష్టగా పూజలు చేశాం. నలుగురు అమ్మాయిల తర్వాత పుట్టిన ఏకైక కొడుకు సుశాంత్. ఎన్నో పూజలు చేస్తే పుట్టిన మా వారసుడికి ఇలాంటి దుస్థితి దాపురిస్తుందా అంటూ కేకే సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ ప్రేయసిపై తండ్రి వ్యాఖ్యలు
సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి అంకితా లోఖండేపై మాకు ఎలాంటి కోపం లేదు. సుశాంత్ మరణం తర్వాత ముంబైలో మమ్మల్ని కలిసింది. ఆమె పాట్నాకు వచ్చి మా ఫ్యామిలీని పరామర్శించింది. వారి బ్రేకప్ కారణాలు చెప్పింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనిపించింది. ఏది జరగాలో అది జరిగిపోయిందనే ఫీలింగ్ కలిగింది అని కేకే సింగ్ తెలిపారు.

వచ్చే ఏడాది పెళ్లి చేసుకొంటానని
సుశాంత్ మరణానికి ముందు కుటుంబంలో పెళ్లి గురించి చర్చ జరిగింది. ఒక సినిమా చేయాల్సి ఉంది. అది త్వరగా పూర్తి చేస్తాను. కరోనా సమయంలో పెళ్లి కుదరదు. కాబట్టి ఫిబ్రవరి, లేదా మార్చి తర్వాత పెళ్లి చేసుకొంటానని చెప్పాడు. నాతో మాట్లాడటం అదే అఖరుసారి. సుశాంత్ చెప్పిన చివరి మాటలు అవే అంటూ తండ్రి కేకే సింగ్ ఎమోషనల్ అయ్యారు.

బాలీవుడ్‌లో ఏదైనా జరుగొచ్చు..
సుశాంత్‌పై బాలీవుడ్ ఇండస్ట్రీ ఒత్తిడి ఉండొచ్చు. సినిమా పరిశ్రమలో ఇలాంటివి జరుగవచ్చు. ఇండస్ట్రీలో ఏదైనా జరుగొచ్చు. గతంలో జరిగాయనేది కూడా తెలిసిందే. ఎవరైనా బాగా ఎదుగుతున్నాడనే ఫీలింగ్ కలిగితే ఏదో ఒకటి చేసి వెనుకకు లాగే ప్రయత్నాలు ఉంటాయి. ఇలాంటివి లేవని నేను చెప్పను. చాలానే జరుగుతున్నాయి అని కేకే సింగ్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











