క్రికెటర్ కాబోయి యాక్టర్‌గా సుశాంత్.. క్రికెట్‌ను ఎందుకు వదిలేశాడంటే..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేవలం నటుడే కాదు.. కాలం కలిసి వస్తే ఇండియాకు ప్రాతినిధ్యం వహించే క్రికెటర్ అయ్యేవాడేమో. కానీ సుశాంత్ జీవితాన్ని పలు రకాలుగా దురదృష్టం వెంటాడింది. క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తున్న సమయంలోనే జీవితంలో అనూహ్యంగా విషాదాలు చోటుచేసుకోవడంతో క్రికెట్‌ను వదిలేశాడని సన్నిహితులు చెప్పేవారు. అయితే ఎందుకు క్రికెట్‌ను వదిలేశాడంటే..

చదువు, క్రీడలపై సుశాంత్ మక్కువ
పాట్నాలోని సెయింట్ కరెన్స్ హై స్కూల్‌లో కొంతకాలం చదువుకొన్ారు. ఆ తర్వాత ఢి్లలీలోని కులాచీ హన్స్ రాజ్ మోడల్ స్కూల్‌లో విద్యను పూర్తిచేశారు. జిల్లాస్థాయి పరీక్షల్లో ఏడో ర్యాంకును సొంతం చేసుకొన్నాడు. ఇక నేషనల్ ఒలంపియాడ్‌లో ఫిజిక్స్ విభాగంలో విజేతగా నిలచాడు.

ఇంజినీరింగ్‌ను వదిలేసి..
తల్లి మరణం తర్వాత ఢిల్లీకి వచ్చిన సుశాంత్ ఇంజినీరింగ్ విద్యలో చేరాడు. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, 11 ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్గామ్‌లో ర్యాంకులను సాధించాడు. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో చదువుతూ యాక్టింగ్‌పై మోజుతో ఇంజినీరింగ్‌ను వదిలేశాడు. నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్యలో మూడేళ్లు చదివి మధ్యలోనే వదిలేసి వచ్చారు.

తల్లి మరణం తర్వాత క్రికెట్‌ను వదిలేసి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు క్రికెట్ అంటే ప్రాణం. క్రికెట్ కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలో విశేషంగా రాణించారని స్నేహితులు చెప్పుకొంటారు. తన సోదరి మిటూ సిం్ బీహార్ స్టేట్ తరఫున క్రికెటర్‌గా ఆడారు. కానీ 2002లో తల్లి మరణం సుశాంత్, ఆయన సోదరి జీవితాలను ఒక్కసారిగా మార్చివేసింది. తల్లి మరణం తర్వాత ఆయన కుటుంబం పాట్నా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయ్యింది. దాంతో క్రికెట్‌కు దూరం అయ్యాడని చెప్పుకొంటారు.

ధోని బయోపిక్‌తో కోరిక తీర్చుకొన్న సుశాంత్
ఇక క్రికెట్‌లో ప్రావిణ్యం ఉండటంతో ఎంఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలో క్రికెటర్‌గా ధోని పాత్రలో ఒదిగిపోయారు. ధోని మాదిరిగా హావభావాలు పలికించడంలో తనదైన పరిణితిని చూపించాడు. సినీ విమర్శకుల ప్రశంసలే కాకుండా సగటు ప్రేక్షకుడి మెప్పును పొందారు. ఎంస్ ధోనిని తలపించే విధంగా నటనను ప్రదర్శించడమే కాకుండా, క్రికెట్‌ను తెరపైన ఆడి క్రీడాభిమానులను కూడా ఆకట్టుకొన్నారు.


Click it and Unblock the Notifications











